ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలలో అరటి సాగు( Banana Cultivation ) దాదాపుగా 1,75,000 ఎకరాల్లో సాగు అవుతోంది.దాదాపుగా లక్ష మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా.
ఆదాయం బాగా ఉండడంతో రైతులు అరటి సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే అరటి సాగు ఎలా చేయాలో పూర్తిగా అవగాహన ఉంటేనే అధిక దిగుబడి పొంది అధిక ఆదాయం అర్జించే అవకాశం ఉంటుంది.
ముందుగా అరటి సాగు ఎలా చేయాలో అనే విషయాలు తెలుసుకుందాం.వేసవికాలంలో నేలను దాదాపుగా 35 సెంటీమీటర్ల లోతులో దిక్కులు దున్నుకోవాలి.
ఇలా రెండు లేదా మూడుసార్లు దున్నితే భూమిలో ఉండే చీడపీడలకు సంబంధించిన గుడ్లు, అవశేషాలు ఉంటే నాశనం అవుతాయి.ఇక అరటి సాగును ఏడాదిలో ఏ సమయంలో అయినా నాటుకోవచ్చు.

ఇక మేలు రకాలకు వస్తే కర్పూర, చక్రకేలి, తెల్ల చక్రకేలి, అమృతపాణి, గ్రాండ్ నైన్ అనేవి అధిక దిగుబడిని ఇస్తాయి.వీటిలో గ్రాండ్ నైన్ రకం రవాణాను బాగా తట్టుకుంటుంది.కాబట్టి ఈ రకాన్ని సాగు చేయడానికి రైతులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.ఇక మొక్కల మధ్య ఒక మీటరు, సాళ్ల మధ్య ఎనిమిది మీటర్ల దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి ( Sunlight, wind )సంపూర్ణంగా మొక్కలకు అంది చాలా వరకు తెగులు పంటను ఆశించే అవకాశం ఉండదు.
నీటి సదుపాయం అధికంగా ఉంటేనే అరటిని సాగు చేయాలి.ఎందుకంటే అరటి సాగుకు నీటి అవసరం చాలా ఎక్కువ.కానీ అధికంగా నీటి తడులు అందించిన, నీరు నిల్వ ఉన్న అరటి పంట తట్టుకోలేదు.కాబట్టి భూమిలో తీమశాతాన్ని బట్టి నీటి తడులు అందించాలి.
అంటే 15 రోజులకు ఒక నీటి తడిని అందించాలి.

ఇక అరటి సాగుకు తామర పురుగుల( Eczema mites ) బెడద చాలా ఎక్కువ.అరటి గెల ఎదుగుతున్న సమయంలో ఈ తామర పురుగులు గుంపులుగా చేరి కాయలలో ఉండే రసాన్ని పూర్తిగా పీల్చేస్తాయి.దీంతో కాయపై చర్మం గరుకుగా మారి కాయలపై గజ్జి వంటి మచ్చలు ఏర్పడతాయి.
చేతికి వచ్చే పంట నాశనం అవుతుంది.ఈ పురుగుల ఉనికిని గుర్తించి వెంటనే ఒక లీటరు నీటిలో క్లోరి పైరిపస్ 2.5 ml కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేటట్టు పిచికారి చేయాలి.అంతేకాకుండా 100 గేజ్ పాలిథిన్ సంచులతో అరటి గెలలను కప్పి ఉంచి ఈ పురుగులను అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు.







