టాలీవుడ్( Tollywood ) లో అయినా ఏ భాష లో అయినా కూడా స్టార్ కపుల్ జోడీగా సినిమాల్లో నటిస్తే ఆ సినిమా లకు మంచి బజ్ క్రియేట్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.నిజమైన భార్య భర్తలు హీరో హీరోయిన్ గా నటించడం వల్ల సినిమా కు మంచి బజ్ క్రియేట్ అవ్వడం చాలా కామన్ విషయం.
రియల్ కపుల్ రీల్ కపుల్ గా కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.కనుక ఆ అరుదైన సంఘటన ను వెండి తెరపై చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు.
తెలుగు లో ఆ మధ్య సమంత( Samantha ) మరియు నాగ చైతన్య( Naga Chaitanya ) పెళ్లి తర్వాత నటించిన మజిలీ సినిమా కు ఏ స్థాయి లో క్రేజ్ దక్కిందో తెల్సిందే.అంతే కాకుండా ఇతర భాషల్లో కూడా ఇలాంటి క్రేజీ కాంబోలో సినిమా లు వచ్చినప్పుడు అభిమానులు తెగ ముచ్చటించుకోవడం మనం చూశాం.
నాగ చైతన్య మరియు సమంత సినిమా మజిలి తరహా లో మెగా కపుల్ మూవీ ని తీసుకు వచ్చేందుకు కొందరు దర్శక నిర్మాతలు తాపత్రయ పడుతున్నారు.

మెగా జంట అయిన వరుణ్ తేజ్ ( Varun Tej )మరియు లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) జంటగా ఒక సినిమా రాబోతుంది.అతి త్వరలోనే ఒక కథ ను రెడీ చేసి ఈ జంట కు వినిపించబోతున్నట్లుగా ప్రముఖ రచయిత పేర్కొన్నాడు.అంతే కాకుండా ఒక దర్శకుడు కూడా వారిద్దరు జంటగా ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.
గతంలో మిస్టర్( mister ) మరియు అంతరిక్షం సినిమా ల్లో వీరిద్దరు కలిసి నటించారు.కనుక ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వీరిద్దరు కలిసి నటించిన రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా నిరాశ పర్చాయి.అయినా కూడా ఈ జంటకు మంచి గుర్తింపు లభించింది అనడంలో సందేహం లేదు.
అందుకే మళ్లీ వీరిని కలిపి చూపించాలని భావిస్తున్నారు.ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరుగబోతుంది.
కనుక వచ్చే ఏడాది వీరి కాంబో మూవీ ఉండే అవకాశాలు లేకపోలేదు.







