అమెజాన్‌లో యాపిల్ డేస్ సేల్... ఆ ఫోన్‌పై భారీ తగ్గింపు!

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ స్మార్ట్ ఫోన్ల( Apple smart phones )కున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు.అయితే వాటిని అందరూ కొనలేని పరిస్థితి వుంది.

కారణం వాటి ధర అధికంగా ఉండడమే.కాబట్టి ప్రత్యేక సేల్స్ సమయంలోనే చాలా మంది యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు.

ఇపుడు అలాంటి సమయమే వచ్చింది.అవును, మీకోసం యాపిల్ సంస్థ అమెజాన్( Amazon ) భాగస్వామ్యంతో కొత్త సేల్ స్టార్ట్ చేసింది.

అమెజాన్ యాపిల్ డేస్ 2023 పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో యాపిల్ లేటెస్ట్ మోడల్ ఫోన్లపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుంది, ఒకసారి లుక్కేయండి మరి.ఇక్కడ ముఖ్యంగా ఐఫోన్ 14 పైన మంచి ఆఫర్లు వున్నాయి.ఐఫోన్ 14 (128 జీబీ) స్టార్టింగ్ మోడల్ ఇక్కడ 15 శాతం తగ్గింపు ధరతో రూ.67,999 వద్ద ప్రారంభం అవుతుంది.ఇక ఐఫోన్ 14 ఫీచర్ల గురించి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.ఈ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 12 ఎంపీ, 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు ఐఓఎస్ 16తో పని చేస్తుంది.

Telugu Amazon, Apple Days, Discount, Latest Offers, Offers-Latest News - Telugu

అదేవిధంగా ఐ ఫోన్ 14 ప్లస్ విషయానికొస్తే, రూ.76,999కు అందుబాటులో ఉంది.6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 12 ఎంపీ, 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు ఐఓఎస్ 16తో ఈ ఫోన్ వర్క్ చేస్తుంది.

Telugu Amazon, Apple Days, Discount, Latest Offers, Offers-Latest News - Telugu

ఐ ఫోన్ 14 ప్రో( Apple iPhone 14 Pro ) ఫోన్ విషయానికొస్తే ఈ సేల్‌లో 8 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,19,999కు అందుబాటులో కలదు.ఈ ఫోన్‌లో 6.1అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 48 ఎంపీ, 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు మరో 12 ఎంపీ టెలిఫొటో కెమెరాతో వర్క్ చేస్తుంది.ఈ ఫోన్‌లో లైడార్ సెన్సార్ ప్రత్యేకం.

ఐఓఎస్ 16తో ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇక చివరగా ఐ ఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్ విషయానికొస్తే ఈ సేల్‌లో రూ.1,27,999కు అందుబాటులో కలదు.ఈ ఫోన్లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 48 ఎంపీ, 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు మరో 12 ఎంపీ టెలిఫొటో కెమెరాతో వర్క్ చేస్తుంది.ఈ ఫోన్‌లో కూడా లైడార్ సెన్సార్ ప్రత్యేకమైన ఆప్షన్.

ఐఓఎస్ 16తో ఈ ఫోన్ పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube