మిల్కీ బ్యూటీ తమన్నా( milky buty tamannaah ) ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది.కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడైతే హ్యాపీ డేస్ సినిమా( Happy days movie ) ను చేసిందో అప్పటి నుండి రచ్చ మొదలు పెట్టింది.
దాదాపు పుష్కర కాలం పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అన్నట్లుగా మారింది.వరుసగా భారీ చిత్రాలను చేస్తూ వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమా లను తన ఖాతాలో వేసుకుంది.
ఇంతటి పేరు ప్రతిష్టలు దక్కించుకున్న ముద్దుగుమ్మ తమన్నా.ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించేందుకు అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.చిరంజీవి మరియు రజినీకాంత్( Tamannaah new movies with Chiru and rajini ) వంటి సీనియర్ లకు మాత్రమే ఈమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ ఇద్దరి సినిమా లు కూడా ముగిసిన నేపథ్యంలో ముందు ముందు ఈమె యొక్క పరిస్థితి ఏంటి అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటూ ఉండగా సిరీస్ ల వెంట పరుగులు తీస్తోంది.

గతంలో తమన్నా వెబ్ సిరీస్ ల్లో నటించింది.కానీ వాటి ద్వారా ఈమె కు పెద్దగా సక్సెస్ దక్కలేదు.కానీ తాజాగా ఈమె చేసిన వెబ్ సిరీస్ జీ కర్దా( Jee karda web series ).అందులో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది.ఆ సన్నివేశాల యొక్క స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న విషయం తెల్సిందే.ఇండస్ట్రీలో తమన్నా యొక్క అందాల విందు ఏ రేంజ్ లో చేసిందో మనం చూశాం.
ఇప్పుడు ఆమె ఇంకా తనను జనాలు చూడాలి… తన గురించి మాట్లాడుకోవాలి అనుకుంటూ ఇలా అందాల ఆరబోత చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అభిమానుల్లో కూడా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.ఆమె జీ కర్దా స్క్రీన్ షాట్స్ ని ఓ రేంజ్ లో నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు.







