యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా కృతి సనన్( Kriti Sanon ) హీరోయిన్ గా నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ దాదాపుగా రూ.550 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది.ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ఆదిపురుష్ ను పేర్కొంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కి యూనిట్ సభ్యులు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పది కోట్ల రూపాయల సినిమా ను తీసి రెండు మూడు కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తున్న రోజులు ఇవి.

ఇలాంటి సమయంలో రూ.550 కోట్ల బడ్జెట్ తో సినిమాను తీసి కనీసం యూనిట్ సభ్యులు ఇంటర్వ్యూలు ఇవ్వక పోవడం ఆశ్చర్యంగా ఉందంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఆదిపురుష్ గురించి అభిమానులు మాట్లాడుకోవడం మినహా యూనిట్ సభ్యులు ఒక్క ఇంటర్వ్యూ తో కూడా మీడియా ముందుకు రాలేదు.దాంతో అసలు సినిమా ను ప్రమోట్ చేసేందుకు యూనిట్ సభ్యులు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఈ టాపిక్ అనేది చాలా సున్నితమైన విషయం.

రామాయణ ఇతివృత్తం లో సినిమా ను చేయడం చాలా పెద్ద సాహసం.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యం లో మతాల మధ్య ఘర్షణలు కూడా తలెత్తే విధంగా గొడవలు వివాదాలు అయ్యే అవకాశం ఉంది.అందుకే ఇంటర్వ్యూల్లో ఏ ఒక్క విషయం మాట్లాడినా కూడా మొత్తం హడావుడి రేగి సినిమా విడుదల ఆగిపోయినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలు యూనిట్ సభ్యులు ఇవ్వడం లేదు.







