వరంగల్ లో( Warangal ) ఓ వ్యక్తి బాబా అవతారం ఎత్తి.భర్తతో విడిపోయిన మహిళలను టార్గెట్ చేస్తూ లోబర్చుకోవటమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నాడు.
తాజాగా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో మంగళవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకలీ బాబాను( Fake Baba ) అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వరంగల్ నగరంలోని ఏనుమామూల ప్రాంతానికి చెందిన షైక్నాలా లబ్బె అనే 58 ఏళ్ల వ్యక్తి బాబా అవతారం ఎత్తాడు.ఇక భర్తల నుండి విడిపోయిన మహిళలు, యువతులను టార్గెట్ చేసి తన వద్ద ఎన్నో మంత్ర శక్తులు ఉన్నాయని వాటితో కుటుంబంలో ఉండే కలహాలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఉండే తగాదాలను చక్కగా పరిష్కరిస్తారంటూ లోబర్చుకునేవాడు.
ఈ క్రమంలోనే భర్తతో విభేదాలు ఉన్న ఓ వివాహితపై కన్నేశాడు.భార్యాభర్తల మధ్య ఉండే తగాదాలకు పరిష్కారం చూపిస్తానంటూ ఏవో కొన్ని పూజలు చేస్తున్నట్లు ఆ మహిళను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆ మహిళ వెంటనే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది.కుటుంబ సభ్యులు బాధితురాలితో కలిసి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులను( Warangal Task Force Police ) ఆశ్రయించారు.
పోలీసులు నకిలీ బాబాను అదుపులోకి తీసుకొని తమ ధైర్యం శైలిలో విచారించారు.దీంతో నకిలీ బాబా గుట్టు రట్టయింది.
తమిళనాడుకు చెందిన షైక్నాలా లబ్బె 40 ఏళ్ల క్రితం వరంగల్ లోని ఎనుమాముల ప్రాంతంలో స్థిరపడ్డాడు.ఏవో తాయత్తులు కట్టి ముందుగా చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ప్రజల నుండి నమ్మకాన్ని పొందాడు.ఆ తరువాత గుట్టుచప్పుడు కాకుండా మహిళలను లోబర్చుకొని లైంగికదాడులకు పాల్పడడం ప్రారంభించాడు.పోలీసులు ఇతని ఇంటిలో తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుకులు, వనమూలికలు నూనె డబ్బాలు లాంటి వాటితో పాటు రూ.25000 స్వాధీనం చేసుకున్నారు.