క్రికెట్ లో ఒక్క బంతికి 18 పరుగులు వచ్చాయంటే నమ్మడం కూడా కష్టమే.అది కూడా ఇన్నింగ్స్ చివరి బంతికి అన్ని పరుగులు వచ్చాయంటే ఆ జట్టుకు ఎంత దరిద్రం ఉందో మాటల్లో చెప్పడం కూడా కష్టమే.
తమిళనాడు ప్రీమియర్ లీగ్( Tamil Nadu Premier League ) లో ఈ సరికొత్త చెత్త రికార్డు నమోదయింది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెపాక్ సూపర్ గిల్లీస్- సేలం స్పార్టన్స్( Chepauk Super Gillies- Salem Spartans ) మధ్య జరిగిన మ్యాచ్లో ఈ చెత్త రికార్డు నమోదు అయ్యింది.
స్పార్టన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వర్ ఒక బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు.

మొదట బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.ఇంకా మిగిలి ఉన్న చివరి బంతిని అభిషేక్ బౌలింగ్( Abhishek bowled the last ball ) చేసి బ్యాటర్ ను క్లీన్ బౌల్డ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఎంపైర్ అది నోబాల్ గా ప్రకటించాడు.ఆ తరువాత చివరి బంతికి 18 పరుగులు రావడంతో చెపాక్ సూపర్ గిల్లీస్ 217 భారీ స్కోరు నమోదు చేసింది.
ఇంతకు చివరి బంతికి 18 పరుగులు ఎలా వచ్చాయో చూద్దాం.
మొదట చివరి బంతి వేసి బ్యాటర్ ను బౌల్డ్ చేశాడు అభిషేక్.
అది నోబాల్ అని తేలడంతో ఒక పరుగు వచ్చింది.తర్వాత బంతి కూడా నోబాల్ వేస్తే అది కాస్త సిక్స్ గా వెళ్ళింది.
దీంతో ఎనిమిది పరుగులు అయ్యాయి.

మూడవసారి వేసిన బంతి కూడా నోబాల్ కావడంతో మరో రెండు పరుగులు వచ్చాయి.దీంతో మొత్తం 11 పరుగులు అయ్యాయి.ఆ తర్వాత వేసిన బంతి వైట్ కావడంతో మొత్తం పరుగులు 12 అయ్యాయి.
ఆ తరువాత వేసిన బంతికి బ్యాటర్ సిక్స్ కొట్టడంతో మొత్తం 18 పరుగులు అయ్యాయి అన్నమాట.
దీంతో 20వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు నమోదు అయ్యాయి.
మ్యాచ్ అనంతరం చివరి ఓవర్ కు పూర్తి బాధ్యత తనదే అంటూ స్పార్టన్స్ కెప్టెన్ అభిషేక్ తెలిపాడు.ఈ మ్యాచ్లో స్పార్టన్స్ 52 పరుగుల తేడాతో ఓటమిని ఖాతాలో వేసుకుంది.







