రామ్ చరణ్ భార్య ఉపాసన( Upasana )కు సోషల్ మీడియాలో, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.మరికొన్ని రోజుల్లో ఉపాసన పండంటి బాబు లేదా పాపకు జన్మనివ్వనున్నారు.
మెగా కుటుంబానికి వారసుడు వస్తాడో లేక వారసురాలు వస్తుందో తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఉపాసన ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
బిడ్డ కోసం ఉపాసన తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.పుట్టబోయే బిడ్డ కోసం ఆమె రక్తాన్ని భద్రపరచాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.
మాయ, బొడ్డు నుంచి తీసిన రక్తాన్ని ప్రత్యేక పద్ధతిలో భద్రపరచనున్నారని కార్డ్ బ్లడ్ అని పిలిచే ఈ బ్లడ్ వల్ల భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చని సమాచారం.

ఉపాసన ముందుచూపుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బిడ్డ విషయంలో ఇంత ప్రేమ చూపించే, ఇంత ప్రేమగా వ్యవహరించే తల్లులు చాలా అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.స్టైమ్ సైట్ ఇండియా అనే సంస్థ ద్వారా ఉపాసన రక్తాన్ని భద్రపరచనున్నారని సమాచారం అందుతోంది.
ఉపాసనది చాలా గొప్ప మనస్సు అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఉపాసన నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి సైతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది.ఉపాసన సోషల్ మీడియా( Social media ) ద్వారా తన నిర్ణయాలను, తన మనస్సులోని భావాలను వెల్లడిస్తూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఉపాసన మరో నెల రోజుల్లో బిడ్డకు జన్మనివ్వనున్నారని తెలుస్తోంది.
జులై నెలలో మెగా ఫ్యాన్స్ కు రెండు శుభవార్తలు ఉండనున్నాయి.ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుండగా మరోవైపు బ్రో మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
మెగా ఫ్యామిలీకి మంచి జరగాలని నెటిజన్లు సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.







