సోనుసూద్( sonusood ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
దేశవ్యాప్తంగా సోను సూద్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో ( hero in real life ) అనిపించుకున్న వ్యక్తి సోను సూద్.
ఎంతోమంది జనాలు దేవుడిగా భావించే వ్యక్తి సోనూసూద్.కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాది మందికి అండగా నిలిచిన వ్యక్తి సోనుసూద్.
నోరు తెరిచి సహాయం కావాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా తనకు తోచిన విధంగా సహాయం చేసి రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నారు.

సోనూసూద్ ని అభిమానులు కలియుగ కర్ణుడు అనే బిరుదు కూడా ఇచ్చేశారు.అంతేకాకుండా సోనూసూద్ విగ్రహానికి పూజలు కూడా నిర్వహించారు.సోను సూద్ సినిమాల విషయానికి వస్తే.
తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లో కూడా నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోను సూద్ ట్విట్టర్ ఖాతాలో ఆస్క్ సోనూసూద్ పేరుతో ఫాన్స్ తో కొద్దిసేపు చాట్ సెషన్ ను నిర్వహించారు.

అందులో భాగంగా ఇళయ దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల( thalapathy Vijay, Superstar Mahesh Babula ) గురించి ఒక్క మాటలో చెప్పండి అని ఒక అభిమాని అడగగా ఆ ఇద్దరితో నేను నటించాను ఇద్దరూ అద్భుతమైన నటులు అంటూ లవ్ ఎమోజిలు పోస్ట్ చేసారు సోను సూద్.దానితో అటు మహేష్, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్ ని మరింత వైరల్ చేస్తున్నారు.ఇకపోతే సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కొత్త కొత్త రకాల యాడ్స్ లో కూడా నటిస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.







