Jabardast Comedian Hari : స్మగ్లింగ్ వివాదం పై స్పందించిన జబర్దస్త్ హరి.. ఆ హరి నేను కాదంటూ?

జబర్దస్త్ కమెడియన్ హరి( Jabardast comedian Hari ) పై ఎర్రచందనం స్మగ్గింగ్ కేసు నమోదు అయిందని, అందులో అతని హస్తం కూడా ఉందని, అయితే హరి తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా అతడిపై కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.

 Jabardasth Hari Krishna Gives Clarity On Red Sandal Smuggling Case-TeluguStop.com

అయితే, తాజాగా చిత్తూరు జిల్లాలో హరిపై మరో కేసు నమోదైంది.పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ మొరంపల్లి వద్ద స్కార్పియో, వేగనార్ కార్లలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Telugu Hari Babu, Jabardasthhari, Red Sandal-Movie

అయితే, పోలీసులను చూసి వాహనాలను అక్కడే వదిలిపెట్టి దొంగలు పరారయ్యారు.డ్రైవర్ తిరుపతి కిషోర్( Tirupati Kishore ) పట్టుబడ్డాడు.అతని నుంచి సమాచారం రాబట్టిన పోలీసులు జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.ఈ మేరకు పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి ( DSP Sudhakar Reddy )మీడియాకు హరి పేరును ప్రకటించారు.

కాణిపాకం పోలీస్ స్టేషన్‌లో హరిపై కేసు నమోదైనట్టు డీఎస్పీ చెప్పారు.అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు.స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.60 లక్షలు ఉంటుందని చెప్పారు.ఇంతవరకు బాగానే ఉంది కానీ కేసు నమోదు అయింది జబర్దస్త్ హరి పై కాదు.హరిబాబుపై.జబర్దస్త్ హరి అని పోలీసులు తెలపడంతో అందరూ జబర్దస్త్ కమెడియన్ హరిత అలియాస్ హరికృష్ణ అనుకొని అనేక రకాలైన వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Telugu Hari Babu, Jabardasthhari, Red Sandal-Movie

జబర్దస్త్ కమెడియన్ హరికృష్ణ ఫొటోలు పెట్టి మరీ వార్తలు రాసేశారు.దీంతో ఈ వివాదం పై హరికృష్ణ స్పందించారు.అసలు ఆ హరిని తాను కాదని తెలిపారు.

ఒకప్పుడు షకలక శంకర్ టీమ్‌లో హరిబాబు పనిచేశాడని అతడి బదులు తనను నిందితుడిగా చూపిస్తున్నారని వాపోయారు.మీడియాలో తనపై ఇలాంటి వార్తలు రావడం వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతోందని హరి అన్నారు.

ఒక్క చిన్న పొరపాటుతో ఊహించని విధంగా పేర్లు ఫోటోలు కూడా మారి సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.మరి హరికృష్ణ స్పందన పై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube