ఆ గ్రేట్ హాలీవుడ్ నటుడు కన్నుమూశాడు...

చిత్ర సీమలో తీవ్ర విషాదం నెలకొంది .ఎన్నో చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అందుకున్న హాలీవుడ్ స్టార్ హీరో ట్రీట్ విలియమ్స్( Hollywood star hero Treat Williams ) కన్నుమూశారు.

 The Great Hollywood Actor Passed Away Details, Treat Williams ,hollywood Star He-TeluguStop.com

కొలరాడోలో బైక్‌ పై వెళ్తూ ఉండగా అదుపు తప్పిన ఓ కారు ఢీ కొనడంతో అయన తీవ్రంగా గాయపడ్డారు.హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.

చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది… విలియమ్స్ 1975 థ్రిల్లర్ చిత్రం డెడ్లీ( Deadly movie ) హీరోతో తన సినీ రంగ ప్రవేశం చేశాడు… మరుసటి సంవత్సరం ది రిట్జ్‌లో సహాయక పాత్ర పోషించి మెప్పించాడు…ఆ తర్వాత మిలోస్ ఫోర్మాన్ చిత్రంలో నటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు .విలియమ్స్ ఈ చిత్రంలోని తన పాత్రకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికయ్యాడు.

 The Great Hollywood Actor Passed Away Details, Treat Williams ,Hollywood Star He-TeluguStop.com
Telugu Deadly, Treatwilliams, Hollywoodtreat, Treat Williams-Movie

విలియమ్స్ కెరీర్‌లో అనేక రంగస్థల పాత్రలు కూడా ఉన్నాయి.అలాగే ప్రిన్స్ ఆఫ్ ది సిటీ, హెయిర్, వన్స్ అపాన్‌ ఎ టైమ్ ఇన్ అమెరికా, డెడ్ హీట్, ఎవర్‌వుడ్, ది డెవిల్స్ ఓన్, ది సబ్‌స్టిట్యూట్ సిరీస్, హాలీవుడ్ ఎండింగ్ వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్( Director Steven Spielberg ) దర్శకత్వం వహించిన 1941 మూవీ ట్రీట్ కి మంచి పేరు తీసుకొచ్చింది.అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.120 సినిమాలతో పాటు , వెబ్ సిరీస్‌లు, టీవీ షోల్లో నటించాడు.ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్నారు.

ట్రీట్ విలియమ్స్ చివరగా 12 మైటీ ఆర్ఫన్స్ లో నటించారు .ఈ మూవీ 2021లో విడుదలైంది.ఆ తర్వాత వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు.అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Telugu Deadly, Treatwilliams, Hollywoodtreat, Treat Williams-Movie

విలియమ్స్ మరణవార్తను ఆయన వ్యక్తిగత కార్యదర్శి బ్యారీ మెక్‌ఫెర్సన్ ధృవీకరించారు( Secretary Barry McPherson confirmed ).విలియమ్స్ కేవలం నటుడిగానే కాక .బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటాడు , 21 సంవత్సరాల వయస్సులో ఒక ప్రైవేట్ పైలట్ గాపని చేశారు విమాన శిక్షకుడిగాను సర్టిఫికేట్ పొందాడు….అతనికి సొంతంగా కొన్ని చిన్న విమానాలు ఉన్నాయి… కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల మధ్య వీటిలో ప్రయాణిస్తారు .ఇక ట్రీట్ విలియమ్స్ అకాల మరణం పట్ల హాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube