మల్టీ టాస్కింగ్ అన్నది ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట .మారుతున్న జీవన విదానం లో మల్టీ టాస్కింగ్ చేస్తే తప్ప కొన్ని పనులు పూర్తి కానీ పరిస్థితి అయితే ఇది అన్ని రంగాలలోనూ సూట్ అయ్యే పని కాదు.
ముఖ్యంగా పూర్తిస్థాయి ఫోకస్ పెట్టాల్సిన రంగాలైన సినిమా లలో , రాజకీయాలలో అసలు సాధ్యం కాదు .కానీ తనదైన ప్రత్యేకత చూపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సినిమా రంగాన్ని ,రాజకీయ రంగాన్నికూడా బ్యాలెన్స్ చేస్తూ తన ప్రత్యేకత ను మెయింటైన్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తెలంగాణ ( Telanagana )ఎన్నికలపై కూడా దృష్టి పెట్టిన పవర్ స్టార్ మూడు పడవల ప్రయాణం దిశగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.తెలంగాణలో కూడా తాము క్రియాశీలక పాత్ర పోషించబోతున్నామన్న సంకేతాలని అక్కడి నియోజకవర్గ ఇన్చార్జిల నియామకంతో పవన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది.తెలంగాణలో పార్టీ వూసే లేదని ,జనసేనకు సానుభూతిపరులు ఉండొచ్చేమో కానీ క్రియాశీలక కార్యకర్తలు లేరు అన్న వార్తలు వస్తున్న నేపద్యం లో తమ ఉనికిని తెలంగాణలో కూడా చాటుకోవడానికి జనసేన సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.పార్టీ పట్ల అభిమానం ఉన్న కార్యకర్తలు ఉన్నప్పటికీ వారిని సంగటితం గా పోలరైజ్ చేసే ప్రయత్నం ఇంతవరకు జనసేన నుంచి జరగలేదు.

అయితే ఇకపై ఆ తప్పులు జరగవని, జనసేనకు తెలంగాణలో కూడా ఒక వేదిక ఏర్పాటు చేయబోతున్నామని ,అక్కడ యూత్ వింగ్ తో మొదలై నియోజకవర్గ ఇన్చార్జిల స్థాయికి పార్టీ ఎదిగిందని .నీళ్లు- నియామకాలు -నిధులు అన్న ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో ఆ కలలు నెరవేరకపోతే ఉపయోగం ఉండదని.ఆ కలల సాదన దిశగా జనసేన కూడా పాటుపడుతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో నిరూపించుకోకుండానే తెలంగాణ లో పార్టీ నిర్మాణం పట్ల ఆసక్తి చూపించడాన్ని ఒక వర్గం తప్పు పడుతున్నప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అవకాశం ఉన్న ప్రతి చోట అదృష్టాన్ని పరిశీలించుకోవాల్సిందేనని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది కూడా అదే అని కూడా మరో వర్గం వాదిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ చాలామందికి సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సాధించారని మాత్రం చెప్పవచ్చు
.






