గూగుల్ మీట్ వాడుతున్నారా..? అందుబాటులోకి మరో కొత్త ఫీచర్

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ ప్రొడక్ట్ అయిన గూగుల్ మీట్‌లో( Google Meet ) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.ఇతర వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ఫ్లాట్‌ఫామ్స్‌కు పోటీగా గూగుల్ మీట్ అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

 Are You Using Google Meet Another New Feature Available, Google Meet, App, Techn-TeluguStop.com

ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం ప్రవేశపెట్టింది.అదే ‘ఆన్ ది గో ఫీచర్’( On the Go Feature ).ఉద్యోగులకు ఈ ఫీచర్ చాలా ఉపయోగపడనుంది.

మీరు మీటింగ్‌లో చేరిన తర్వాత క్రింద ఉండే మూడు చుక్కలను క్లిక్ చేసి ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన వెంటనే మీ వీడియోతో పాటు ఇతరుల వీడియోను కూడా ఆపేస్తుంది.మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు అర్జంట్ మీటింగ్‌లో పాల్గొనాల్సి వస్తే ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

కావాలంటే మీరు అసవరమైనప్పుడు ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.మొబైల్‌లో గూగుల్ మీట్ వినియోగించి మీటింగ్‌లో పాల్గొనేవారికి ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది.

ఈ ఫీచర్ యాక్టివేట్ చేస్తే మీరు వేరే వినియోగదారు ఇంటర్‌ఫేస్‌కు మారతారు.రేజ్ హ్యాండ్, మ్యూట్, ఆడియో ( Rage Hand, Mute, Audio )కోసం పెద్ద చిహ్నాలను చూస్తారు.మీరు బ్లూతూట్ కు కూడా అవసరమైతే కనెక్ట్ చేసుకోవచ్చు.మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్‌ను ఆన్ చేయమని సూచిస్తుంది.మీరు బయట ఉన్న సమయంలో మీటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నప్పుడు ఈ మోడ్ ను ఆన్ చేసే ఎలాంటి డిస్టబ్ ఉండదు.ఆడియో క్వాలిటీ కూడా బాగా వస్తుంది.

ఇప్పటివరకు ఏ వీడియో కాన్పరెన్స్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇలాంటి ఫీచర్ లేదు.తొలిసారి గూగుల్ మీట్ ఈ ఫీచర్‌ను తమ యూజర్ల కోసం తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube