గూగుల్ మీట్ వాడుతున్నారా..? అందుబాటులోకి మరో కొత్త ఫీచర్

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ ప్రొడక్ట్ అయిన గూగుల్ మీట్‌లో( Google Meet ) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇతర వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ఫ్లాట్‌ఫామ్స్‌కు పోటీగా గూగుల్ మీట్ అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం ప్రవేశపెట్టింది.అదే 'ఆన్ ది గో ఫీచర్'( On The Go Feature ).

ఉద్యోగులకు ఈ ఫీచర్ చాలా ఉపయోగపడనుంది. """/" / మీరు మీటింగ్‌లో చేరిన తర్వాత క్రింద ఉండే మూడు చుక్కలను క్లిక్ చేసి ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన వెంటనే మీ వీడియోతో పాటు ఇతరుల వీడియోను కూడా ఆపేస్తుంది.

మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు అర్జంట్ మీటింగ్‌లో పాల్గొనాల్సి వస్తే ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

కావాలంటే మీరు అసవరమైనప్పుడు ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.మొబైల్‌లో గూగుల్ మీట్ వినియోగించి మీటింగ్‌లో పాల్గొనేవారికి ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది.

"""/" / ఈ ఫీచర్ యాక్టివేట్ చేస్తే మీరు వేరే వినియోగదారు ఇంటర్‌ఫేస్‌కు మారతారు.

రేజ్ హ్యాండ్, మ్యూట్, ఆడియో ( Rage Hand, Mute, Audio )కోసం పెద్ద చిహ్నాలను చూస్తారు.

మీరు బ్లూతూట్ కు కూడా అవసరమైతే కనెక్ట్ చేసుకోవచ్చు.మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్‌ను ఆన్ చేయమని సూచిస్తుంది.

మీరు బయట ఉన్న సమయంలో మీటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నప్పుడు ఈ మోడ్ ను ఆన్ చేసే ఎలాంటి డిస్టబ్ ఉండదు.

ఆడియో క్వాలిటీ కూడా బాగా వస్తుంది.ఇప్పటివరకు ఏ వీడియో కాన్పరెన్స్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇలాంటి ఫీచర్ లేదు.

తొలిసారి గూగుల్ మీట్ ఈ ఫీచర్‌ను తమ యూజర్ల కోసం తీసుకొచ్చింది.

నేను మీసం తిప్పితే ఓట్లు పడతాయా ? క్లాస్ పీకిన పవన్