స్టాక్ మార్కెట్‌లో సంచలనం.. MRF సంచలన రికార్డు

స్టాక్ మార్కెట్‌లో సంచలనం చోటుచేసుకుంది.టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది.

 స్టాక్ మార్కెట్‌లో సంచలనం.. Mrf -TeluguStop.com

ఎంఆర్‌ఎఫ్( MRF ) షేర్ ధర ఏకంగా రూ.లక్షకు చేరుకుంది.ఇప్పటివరకు స్టాక్ మార్కెట్‌లో ఏ షేర్ లక్షకు చేరుకోలేదు.దీంతో షేర్ ధర రూ.లక్షకు చేసుకున్న కంపెనీగా ఎంఆర్‌ఎఫ్ స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించింది.ఇండియాలోనే పెద్ద కంపెనీలైన రిలయన్స్, టీసీఎస్ లాంటి కంపెనీల షేర్ ధర కూడా ఇప్పటివరకు రూ.లక్షకు చేరుకోలేదు.

Telugu Bussiness, Latest, Page, Sensational, Shree, Stock-Latest News - Telugu

పెద్ద పెద్ద కంపెనీలకు కూడా చేతకాని రికార్డును ఎంఆర్‌ఎఫ్ కంపెనీ సాధించింది.ఇవాళ బీఎస్‌ఈలో ఎంఆర్ఎఫ్ షేర్ ధర 1.37 శాతం ర్యాలీ చేసి రూ.100,300కి చేరుకుంది.అంతకుముందు మే నెలలో రూ.లక్షకు చేరుకోవడానికి కేవలం రూ.66.50 దూరంలో ఎంఆర్‌ఎఫ్ నిలిచింది.ఇప్పుడు పెరిగి ఇవాళ రూ.లక్ష దాటింది.దీంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అత్యధిక షేర్ ధర కలిగిన కంపెనీగా ఎంఆర్‌ఎఫ్ అగ్రస్థానంలో నిలిచింది.

Telugu Bussiness, Latest, Page, Sensational, Shree, Stock-Latest News - Telugu


రెండో స్థానంలో హానీవెంట్ ఆటోమేషన్ ఉండగా.మూడో స్థానంలో పేజ్ ఇడస్ట్రీస్( Page Industries ) ఉంది.ఇక నాలుగో స్థానంలో శ్రీ సిమెంట్( Shree Cement ) ఐదో స్ధానంలో 3ఎం ఇండియా ఉన్నాయి.ఆ తర్వాత నెస్లే ఆరు, అబోట్ ఇండియా ఏడో స్థానంలో ఉన్నాయి.

బాష్ ఎనిమిదో స్థానంలో ఉంది.రెండో స్థానంలో ఉన్న హనీవెట్ ఆటోమేషన్ షేర్ ధర రూ.41,152గా ఉంది.అంటే తొలి స్థానంలో ఉన్న ఎంఆర్‌ఎఫ్ షేర్ ధరతో పోలిస్తే రెండిటి మధ్య 60 శాతం తేడా ఉంది.

చెన్నైకు చెందిన ఎంఆర్ఎఫ్ కంపెనీ 42,41,143 షేర్లను కలిగి ఉంది.వీటిల్లో 30,60,312 షేర్లు పబ్లిక్ షేల్హోల్డర్ల చేతుల్లో ఉన్నాయి.ప్రమోటర్ల దగ్గర 11,80,931 షేర్లు ఉన్నాయి.ఎంఆర్‌ఎఫ్ స్టాక్ ఏకంగా గత మూడు నెలల్లో 20 శాతంకుపైగా ర్యాలీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube