వైరల్: షారూఖ్ పాటని ఆసక్తికరంగా తిలకించిన పిల్లి... షారూఖ్ అభిప్రాయం ఇదే!

అందుకేనేమో ఈ కలియుగాన్ని స్మార్ట్ యుగం అని కూడా పిలుస్తున్నారు.సోషల్ మీడియా అందుబాటులో వచ్చాక వింత వింత దృశ్యాలు దర్శనం ఇస్తున్నాయి.

 Viral Shahrukh's Song Interestingly Seen By The Cat This Is Shahrukh's Opinion,-TeluguStop.com

ఇటీవల కాలంలో మీరు గమనిస్తే జంతువులు కూడా టీవీలు, మొబైల్ ఫోన్స్ చూస్తున్న దృశ్యాలు మనకు సోషల్ మీడియాలో అనేకం కనబడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా షారూఖ్ ఖాన్ ( Shah Rukh Khan )పాటను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న పిల్లి వీడియో ఒకటి వైరల్ కావడం మనం గమనించవచ్చు.

అదంతా ఒకెత్తయితే దీనిపై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ స్వయంగా స్పందించడం విశేషం.

అవును, మీరు విన్నది నిజమే.షారూఖ్ ఖాన్ క్రేజ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ఏజ్ పెరుగుతున్నా తరగని ఫ్యాన్స్‌ ఆయన సొంతం.

ఇక రీసెంట్‌గా వైరల్ అవుతున్న వీడియో గమనిస్తే ఆయనను జంతువులు కూడా అభిమానిస్తున్నట్లు అనిపిస్తోంది.తియా శ్రీ ఇరేరా( Thia Sri Irera ) అనే ట్విట్టర్ యూజర్ షారూఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ టైటిల్ ట్రాక్‌ని తన ఫోన్‌లో ప్లే చేస్తుంటే అతని పెంపుడు పిల్లి( pet cat ) ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటే ఆ దృశ్యాన్ని తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ క్లిప్‌ను షేర్ చేస్తూ ‘హాయ్ సార్.నా పిల్లి మిమ్మల్ని ప్రేమిస్తోంది’ అనే శీర్షికను జోడించాడు.

అయితే అతడు అలా షేర్ చేసినపుడు బహుశా ఊహించి వుండడు, దీనిపై షారూఖ్ స్వయంగా స్పందిస్తాడని.అయితే షారుఖ్ తాజాగా ఆ వీడియోపై స్పందిస్తూ….‘నా ప్రేమను మీ పిల్లికి తెలియజేయండి.ఇకపై నా సినిమాలను డాగ్స్ కూడా చూపిస్తాను.

అప్పుడు నేను ఇంకా బాగా సెట్ అవుతాను’ అంటూ రీట్వీట్ చేశారు.దాంతో ఆ వీడియో మరింత వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు ఆ విడియోపైన కామెంట్లు పెడుతున్నారు.చాలామంది నెటిజన్లు ఆ కుక్క చాలా అదృష్టవంతురాలంటూ కొనియాడుతున్నారు.

ఇకపొయే షారూఖ్ ఖాన్ ట్విట్టర్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు.అందుకే అతను సూపర్ స్టార్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube