యుక్రెయిన్‌తో యుద్ధం సమయంలో పారిపోయిన రష్యా సైనికుడి అంతరంగం ఇదే?

యుక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి అంతగా ఇష్టం లేని అనేకమంది సైనికులు రష్యా( Russia ) నుంచి పారిపోతున్న సంగతి మీరు వినే వింటారు.అలాంటి వారిలో డిమిత్రి ( Dimitri )ఒకరు.

 Is This The Inside Of A Russian Soldier Who Defected During The War With Ukraine-TeluguStop.com

డిమిత్రి రష్యాకి చెందిన యుద్ధ విమానాన్ని నడిపే ఓ సిసలైన అధికారి.వాయువ్య రష్యాలోని పిస్కోవ్ ప్రాంతంలో ఉన్న సైన్య స్థావరంలో ఈయన పనిచేసివారు.తన హెలికాప్టర్‌ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నప్పుడే, అది కేవలం ప్రాక్టీస్ కాదని, నిజంగానే యుద్ధం చేయబోతున్నామని డిమిత్రి గ్రహించారు.2022 జనవరిలోనే ఎయిర్ ఫోర్స్ విడిచిపెట్టేందుకు డిమిత్రి యత్నించారు.కానీ, దానికి అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తికాలేదు.ఇంతలో ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్‌పై దాడికి దిగింది.

Telugu War, Latest, Russian Soldier, Telugu Nri, Ukraine-Telugu NRI

ఈ క్రమంలోనే డిమిత్రిని బెలారస్( Dmitry Belarus ) పంపించి, హెలికాప్టర్‌లో మిలటరీకి సరుకులు సప్లయి చేసే బాధ్యతలు అప్పగించింది రష్యన్ ప్రభుత్వం.అయితే డిమిత్రి యుక్రెయిన్‌లో అడుగుపెట్టలేదట.అక్కడినుండి ఎలా తప్పించుకోవాలని పధకాలు రచించాడట.తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన డిమిత్ర తన అంతరంగాన్ని పంచుకున్నాడు.“ఓ మిలటరీ అధికారిగా నా దేశాన్ని దాడుల నుంచి కాపాడడం నా బాధ్యత.అదేవిధంగా కారణం లేకుండా నేను ఏ యుద్ధం చేయకూడదు అనేది నాకు తెలిసిన ధర్మం.

మేం యుక్రెయిన్‌పై ఎందుకు దాడి చేయాలి? ఆ దేశ నగరాలను ఎందుకు నాశనం చేయాలి? దానికి మా దేశం నాకు సరియైన వివరణలు ఇవ్వలేదు” అన్నారు డిమిత్రి.

Telugu War, Latest, Russian Soldier, Telugu Nri, Ukraine-Telugu NRI

ఇకపోతే యుక్రెయిన్ తో యుద్ధం చేయడం తనలాగే అనేకమందికి ఇష్టంలేదని చెప్పుకొచ్చాడు.అక్కడ యుద్ధం చేయడానికి సైన్యంలో చేరడానికి ఆకర్షణీయమైన 2,04,000 రూబిల్స్ జీతాన్ని యువతకు ఆశ చూపిస్తున్నారని కూడా చెప్పుకొచ్చాడు.యుక్రెయిన్ యుద్ధంపై అభిప్రాయాలు ఎలా ఉన్నా, అక్కడి నుంచి వస్తున్న యుద్ధ నివేదికలను ఆర్మీలో ఎవరూ నమ్మడం లేదని డిమిత్రి ఈ సందర్బంగా అనడం కొసమెరుపు.

అదే విధంగా యుద్ధం ప్రారంభంలో ప్రాణనష్టం వాటిల్లలేదని, యుద్ధపరికరాలు అసలు నష్టపోలేదని రష్యన్ కమాండ్ చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవం అని చెప్పుకొచ్చాడు డిమిత్రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube