అవును, ఇండియా మంచి స్పీడుమీద వుంది.ఇరుగు పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా( Pakistan, China ) నుంచి రోజురోజుకీ పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో సుదూర లక్ష్యాలు టార్గెట్ చేసే ఆయుధాలు డెవలప్ చేయడానికి కసరత్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ విషయాన్ని స్వీడన్కు చెందిన థింక్- ట్యాంక్ సిప్రి( Think-tank Cipri ) వెల్లడించింది.
థింక్ ట్యాంక్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.భారత్తో పాటు పాకిస్థాన్కూడా తమ అణ్వాయుధాలు విస్తరించడం, అణు డెలివరీ సిస్టమ్ లు అభివృద్ధి చేస్తూ ఉండడం గమనార్హం.

ఇంచుమించుగా చైనాలో ఎక్కడైనా తమ లక్ష్యాలను ఈజీగా చేరుకునే సామర్థ్యంతో కూడిన వెపన్స్ తయారు చేయడానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోందని సిప్రీ ఇయర్ బుక్ 2023లో పేర్కొనగా ఈ విషయం ఇపుడు పెను సంచలంగా మారింది.ఇండో పసిఫిక్ సముద్రంలో మారుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కావచ్చు, చైనా బల ప్రదర్శన మరోవైపు, సైనిక ఆధునికీకరణ పరిస్థితులను గమనించి భారత్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా తన సామర్థ్యాలను పెంచుకొనే లక్ష్యంగా భారత్ ముందుకు పోతున్నట్టు తెలుస్తోంది.ఇందుకోసం అధునాతన టెక్నాలజీని వాడుకుంటోంది.5,000 కి.మీ.లక్ష్యాన్ని ఛేదించే అగ్ని – వీ వంటి శ్రేణి బాలిస్టిక్ క్షిపణులకు రక్షణ మంత్రిత్వ శాఖ మరిన్ని మెరుగులు దిద్దుతున్నట్టు కనబడుతోంది.సిప్రీ నివేదిక ప్రకారం, 2022 జనవరిలో చైనా అణు ఆయుధాలు 2022లో 350 వార్హెడ్ల నుంచి 2023 జనవరి నాటికి 410కి పెరిగాయి.
ప్రస్తుతం ఇండియాలో 164 అణు వార్హెడ్లు మాత్రమే ఉన్నాయి.కాబట్టి రానున్న రోజుల్లో చైనా సంఖ్యను దాటడానికి భారత్ యత్నిస్తోందని నివేదించింది.గతంతో పోల్చుకుంటే గత 15 ఏళ్లలో భారత్ చాలా శక్తివంతమైన దేశంగా ఎదిగిందని అభిప్రాయపడింది.







