ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది.ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ ఇంఛార్జ్ ముందే పార్టీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.వేదికపై కొత్తగూడెం జిల్లా నేతలకు కనీసం కుర్చీలు కూడా వేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు.దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.







