ఏపీ తెలంగాణలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పూర్తిగా ఎన్నికల మూడ్లోకి పార్టీ నేతలను తీసుకువెళ్లాలని ఆలోచనతో బిజెపి అగ్ర నేతలు ఉన్నారు.ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బిజెపి( BJP ) ఓటమి చెందడంతో డీలా పడిన బీజేపీ ఏపీ, తెలంగాణ విషయంలో అది రిపీట్ కాకుండా పూర్తిస్థాయిలో పార్టీ అంతర్గత విషయాలపై ఫోకస్ పెట్టింది.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, అక్కడ పార్టీని పూర్తిగా యాక్టివ్ చేయాలని భావిస్తుంది .తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) వైఖరిని తప్పుపడుతూ తెలంగాణ బిజెపి నేతలు కొంతమంది తరచుగా ఢిల్లీ కి వచ్చి ఫిర్యాదులు చేస్తుండడం , ఇటీవల కాలంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , మొదట్లో బండి సంజయ్ కారణంగానే బిజెపికి హైప్ వచ్చినా, ఇప్పుడు ఒక్కసారిగా గ్రాఫ్ పడిపవడం వంటివన్నీ లెక్కలు వేసుకుంటున్న బిజెపి అధిష్టానం సంజయ్ ను తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చిందంట.

ఈ నెలలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్న నేపథ్యంలో బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చకపోతే కాంగ్రెస్( Congress ) లో చేరిపోతామని ఇటీవల కాలంలో బిజెపిలో చేరిన నేతలు అంతా హెచ్చరికలు చేయడం, ఈటెల రాజేందర్ తరచుగా ఢిల్లీకి( Delhi ) వెళ్లి బిజెపి హై కమాండ్ వద్ద ఫిర్యాదులు చేస్తుండడం , ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న బిజెపి అధిష్టానం పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలంటే సంజయ్ ను మార్చడం ఒక్కటే మార్గమని భావిస్తుందట.

ఇక బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Viraraju ) విషయంలోనూ ఇదే వైఖరితో ఉందట.సోము వీర్రాజు కారణంగా పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం బిజెపి పెద్దగా బలం పుంజుకోలేకపోవడం, చేరికలు పెద్దగా లేకపోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ నియోజకవర్గాల ద్వారా తెలుస్తుంది.ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.







