కార్తికేయ, కార్తికేయ2, ప్రేమమ్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో చందు మొండేటి( Chandoo Mondeti ) ఒకరు.ఈ డైరెక్టర్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ దర్శకుని తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయి.
గీతా ఆర్ట్స్ బ్యానర్( Geeta Arts ) నుంచి ఈ దర్శకునికి భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం అందుతోంది.మూడు సినిమాలకు ఏకంగా 30 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని బోగట్టా.
చందు మొండేటి జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా మూడు సినిమాలకు పని చేసే అవకాశం దక్కింది.ఈ విషయంలో చందు మొండేటి ఒకింత అదృష్టవంతుడు అనే చెప్పాలి.కార్తికేయ2 ( Karthikeya 2 ) సక్సెస్ తో ఈ దర్శకుని దశ తిరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గీతా ఆర్ట్స్ నిర్మాతలు సినిమా నిర్మాణం విషయంలో కూడా ఏ మాత్రం రాజీ పడరనే సంగతి తెలిసిందే.

నాగచైతన్య చందు మొండేటి కాంబోలో ఒక సినిమా, సూర్య చందు కాంబోలో మరో సినిమా తెరకెక్కనుండగా బాలీవుడ్ హీరోతో చందు మొండేటి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.ఈ మూడు ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూడు సినిమాలు సక్సెస్ సాధిస్తే చందు మొండేటి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.చందు మొండేటి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కార్తికేయ2 పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇతర భాషల ప్రేక్షకులు ఈ దర్శకుని డైరెక్షన్ లో పని చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.రాబోయే రోజుల్లో చందూ మొండేటి పాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చాటాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.చందూ మొండేటి రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.







