తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీ లో ఏదైనా తన తర్వాతే ఏ సినిమా రికార్డ్ బ్రేక్ చేయాలన్న తనవల్లే అవుతుంది అంటూ ఒకప్పుడు ఇండస్ట్రీ కి చాలా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన నందమూరి నటసింహం గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్లను అందిస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు…ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ అందించాలని, ఓ భారీ యాక్షన్ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో చేతులు కలిపారు.మరి లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్యతో భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లి( Director Bobby ) దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ నిన్న అట్టహాసంగా అయితే లాంచ్ చేశారు…
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి చిత్ర పనులు ప్రారంభించారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిన్న(జూన్ 10) నిర్వహించిన పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను బడా మాస్ దర్శకుడు వి.వి.వినాయక్( VV Vinayak ) తన చేతుల మీదుగా చిత్ర బృందానికి అందజేశారు.దక్షిణ కొరియా గౌరవ కౌన్సెల్ జనరల్ చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.
విజయవంతమైన దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేశారు.మొదటి షాట్ కి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలిపేలా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలతో కథానాయకుడి పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతుందో తెలియజేశారు.కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేసింది చిత్ర బృందం.”వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్” అనే లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో వివరించారు.
అలాగే “ప్రపంచానికి అతను తెలుసు.కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు” అంటూ పోస్టర్ పై రాసున్న సినిమా ట్యాగ్‌లైన్ లు ఆసక్తిగా మారాయి.

అయితే ఇదంతా చూసిన జనాలు ఈ సినిమా కి సంభందించిన స్టోరీ అంటూ ఒక స్టోరీ ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.అదేంటంటే తన జీవితంలో అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి (హీరో) సమాజం కోసం బతుకుతూ తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక బలమైన వ్యక్తి స్టోరీ నే ఇది అంటూ ఒక స్టోరీ ని నెట్లో తెగ హల్చల్ చేస్తున్నారు… మరి అది నిజమైన బాలయ్య స్టోరీ యేన కాదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే…ఇక ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది ఉంటుందని ఈ మూవీ మేకర్స్ చెప్తున్నారు…








