వేసవికాలంలో( Summer ) ఆరోగ్యంగా ఉండడం చాలా కష్టమని చెప్పాలి.ఎందుకంటే వేసవిలో విపరీతమైన వేడి వలన గుండెపోటుకు( Heart Attack ) కారణం కావచ్చు.
ఎందుకంటే ఈ సమయంలో వేసవి కాలం వాతావరణంలో వేడి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.అలాగే దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి.
అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పెరగడం వలన ప్రజలు ఆరోగ్యపరంగా నేరుగా ప్రభావితం అవుతున్నారు.ఈ సీజన్లో అనేక రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది.
అయితే ముఖ్యంగా డీహైడ్రేషన్, రక్తపోటుకు సంబంధించి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.ఇక అధిక వేడి( Over Heat ) గుండెపోటుకు కారణం అవుతుందనే ప్రశ్న తరచుగా ప్రజల మనసులో తిరుగుతుంది.

ఎందుకంటే వేడి గుండెపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చాలామంది నమ్ముతారు.అయితే తీవ్రమైన వేడి గుండెపోటుకు కారణం అవుతుందా.? అయితే నిపుణులు ఏమి సమాధానం ఇచ్చారు? ఇప్పుడు తెలుసుకుందాం.న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ కార్డియాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వనిత అరోరా ప్రకారం తీవ్రమైన వేడి కారణంగా ప్రజలు టీహైడ్రేషన్, రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఇక చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో రక్తనాళాలు విస్తరిస్తాయి.అలాగే రక్తపోటు కూడా తగ్గిపోతుంది.తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ సీజన్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.

ఇది నేరుగా గుండెపోటుకు సంబంధించినది కానప్పటికీ కూడా వేడి వలన గుండెపోటు వస్తుందని చెప్పడం మాత్రం సరికాదు.అయితే వేడి, గుండెపోటు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదు.ప్రతి సీజన్లో ప్రజలు హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.
వేసవిలో డీహైడ్రేషన్ ను నివారించడానికి ప్రజలు ప్రతిరోజు రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగాలి.ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.అలాగే నీటిలో కొంచెం ఉప్పు కలిపి తాగితే రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.వేడి వల్ల అనేక సమస్యలు వస్తాయి.
కానీ గుండెపోటు వచ్చే ప్రమాదం మాత్రం లేదు.అయినప్పటికీ ప్రతి సీజన్లో కూడా గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం చాలా అవసరం.