సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార (Nayanatara)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ (Vignesh Shivan)ను వివాహం చేసుకున్నారు.
గత ఏడాది జూన్ 9వ తేదీ వీరిద్దరూ మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇక ఈ ఏడాది జూన్ 9వ తేదీకి వీరి మొదటి వివాహ వార్షికోత్సవం(First Wedding Anniversary) కావడంతో ఈ మొదటి పెళ్లి రోజును ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది.
ఇక నయనతార విగ్నేష్ గత ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకోగా అక్టోబర్ నెలలో సరోగసి ద్వారా కవల మగ పిల్లలకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా తమ పెళ్లిరోజు సందర్భంగా మొదటిసారి వారిద్దరి పిల్లల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు.అంతేకాకుండా విగ్నేష్ నయనతార గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ తనుకు మొదటి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే తన పెళ్లిరోజు సందర్భంగా నయనతార విగ్నేష్ తన స్నేహితులతో కలిసి మాట్లాడుతూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
ఆ సమయంలోనే విగ్నేష్ తనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.
అందరూ రూమ్ లో కూర్చుని మాట్లాడుతుండగా ఒక వ్యక్తి అక్కడికి ఫ్లూట్ వాయిస్తూ వచ్చారు.ఆయన ఎంతో అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండడంతో నయనతార అన్ని మైమరిచిపోయి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను హత్తుకొని కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయింది.కొంత సమయానికి ఆ రూమ్ మొత్తం చాలా ఎమోషనల్ గా మారిపోయిందని చెప్పాలి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ దంపతులు మొదటి పెళ్లిరోజు జరుపుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.