ఇండియాలో ఈ జాబ్స్ కి ఎక్కువ శాలరీస్ ఇస్తారని మీలో ఎంతమందికి తెలుసు?

సాధారణంగా ప్రజలు ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్స్ చేయాలని ఇష్టపడుతుంటారు.అయితే అందుకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే మన ఇండియాలో కళ్ళు చెదిరే మొత్తాలలో జీతం ఇచ్చే జాబులు చాలానే ఉన్నాయి.వాటిలో టాప్ జాబ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• డేటా సైంటిస్ట్:ఇండియాలో డేటా సైంటిస్టులకు( Data Scientists ) ఫుల్ డిమాండ్ ఉంది.పెద్ద మొత్తంలో డేటాను అర్థం చేసుకొని, డేటా ప్యాట్రన్స్‌ను గుర్తించి భవిష్యత్తులో లోతైన విశ్లేషణ చేసే బాధ్యత వీరికి ఉంటుంది.

అంతేకాదు ఈ ఉద్యోగం చేసేవారు ఓల్డ్ డేటాను విశ్లేషించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వాడాల్సి ఉంటుంది.మ్యాథ్స్, స్టాట్స్ సబ్జెక్టులలో వీరు బాగా రాణించాలి.కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.

Advertisement

బిజినెస్ - ఐటీ రంగాల మధ్య ఒక వారధిలా పని చేయాలి.అలాంటి లక్షణాలు ఉంటే అమెజాన్, వాల్‌మార్ట్ ల్యాబ్స్, గ్రేఆటమ్( Amazon, Walmart Labs, GreyAtom ) వంటి దిగ్గజ సంస్థల్లో చేరి ఏడాదికి 70 లక్షల వరకు డబ్బులు సంపాదించవచ్చు.

• మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్ :మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్‌ మాథ్స్( Machine Learning Experts ) అనాలసిస్ చేస్తుంటారు.బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం అప్లై చేయగల ML ప్రోగ్రామ్‌లు, అల్గారిథమ్‌లను అభివృద్ధి చేస్తారు.ఈ విషయాలలో బాగా నైపుణ్యం సంపాదించిన వారు యాక్సెంచర్, ఐబీఎం, ఐటీసీ ఇన్ఫోటెక్ వంటి సంస్థలలో చేరి ఏటా రూ.19 లక్షల వరకు సంపాదించవచ్చు.

• బ్లాక్‌చెయిన్ డెవలపర్:బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు.కరెన్సీ ట్రాన్సాక్షన్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా సేఫ్టీతో పాటు డేటా హ్యాండ్లింగ్ వంటి వాటిలో ప్రస్తుతం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అన్ని కంపెనీలు తీసుకొస్తున్నాయి.మధ్యవర్తులను, ఖర్చులను తగ్గించడానికి, వేగంగా పనులు జరిగిపోవడానికి ప్రభుత్వాలు కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో బ్లాక్‌చెయిన్ అప్లికేషన్లను సూపర్‌వైజ్‌, డెవలప్ చేసే బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లకు డిమాండ్‌ బాగా పెరిగింది.వీరికి శాలరీలు కూడా సంవత్సరానికి 10 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

పైన పేర్కొన్న ఉద్యోగాలతో పాటు స్టాక్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ ఉద్యోగులకు చాలా అధిక శాలరీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు