వైరల్: ఘోరంగా విఫలమైన సైకిలిస్ట్ స్టంట్.. అందుకే ఎక్సట్రాలు వద్దనేది!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ముఖ్యంగా యువత వింత పోకడలకు పోతున్నారు.ఈ క్రమంలో రీల్స్ చేయడం కోసం లేనిపోని రిస్కులు చేస్తూ కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.

 Viral Cyclist's Stunt Failed Miserably That's Why Extras , Over Action, Viral La-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలామంది రోడ్లపై విచక్షణా రహితంగా స్టెంట్స్ చేస్తున్నారు.ఈ విషయంలో రోడ్ సేఫ్టీపై పోలీసులు( road safety ) ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది.

ఇక తాజాగా సైకిల్ స్టంట్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేస్తూ ఓ మంచి సందేశాన్ని పంచుకున్నారు ఢిల్లీ( Delhi ) పోలీసులు.వీరు నిరంతరం అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారనే విషయం తెలిసినదే.

ముఖ్యంగా సైబర్ క్రైమ్‌కి( cybercrime ) సంబంధించిన అంశాలు, రోడ్ సేఫ్టీపై ఎక్కడ పోలీసులైనా నిరంతరం అవగాహన కలిగిస్తూ వుంటారు.ఈ క్రమంలో ఇపుడు వీరు సోషల్ మీడియాను వేదికగా మలుచుకుంటున్నారు.ఈ పోస్టుల ద్వారా ప్రజలు సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ పోలీసులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన మరో వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోని ఒకసారి గమనిస్తే ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ మనకి కనిపిస్తాడు.మొదట తిన్నగా తొక్కేవాడు తరువాత తన కాళ్లను సైకిల్ హ్యాండిల్‌పై పెట్టి బ్యాలెన్స్ చేస్తాడు.

ఇక చేతులేమో గాల్లోకి చూపిస్తాడు.

కట్ చేస్తే సెకెండ్ల వ్యవధిలోనే మనోడు సైకిల్ మీదనుండి అదుపుతప్పి కింద పడిపోయాడు.ఈ ఫన్నీ అండ్ రిస్కీ వీడియోని ఢిల్లీ పోలీసులు షేర్ చేస్తూ… ‘ఇలాంటి స్టంట్స్ అంత శ్రేయస్కరం కాదు.చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తాయి.

రోడ్డుపై సురక్షితంగా పయనించండి, ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టకండి’ అనే క్యాప్షన్‌ జోడించారు.ఇక ఈ వీడియో ఇపుడు తెగ వైరల్ అవుతోంది.నెటిజన్లు అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘ఏదైనా ఫీట్స్ చేసేటపుడు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి’ కొందరు కామెంట్ చేస్తే, ‘ప్రజలకు అవగాహన కల్పించడంలో ఢిల్లీ పోలీసుల తర్వాతే ఎవరైనా’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఎమోజీలతో తమ స్పందన తెలియజేశారు.ప్రజలను చైతన్య పరచడంలో ఢిల్లీ పోలీసులు ముందున్నారని చాలామంది కితాబు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube