టాలీవుడ్ క్యూట్ కపుల్ హీరో శివ బాలాజీ( Shiva Balaji ) హీరోయిన్ మధుమిత( Madhumitha ) గురించి మనందరికీ తెలిసిందే.తాజాగా ఈ క్యూట్ కపుల్ వెన్నెల కిషోర్( Vennela Kishor ) హోస్ట్గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షోలో( Ala Modalaindi Show ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.అలాగే కెరియర్లు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా చెప్పుకొచ్చారు.
కాగా శివ బాలాజీ మధుమిత లది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ మీ ప్రయాణం ఎలా మొదలైంది అని ప్రశ్నించగా.
శివ బాలాజీ మాట్లాడుతూ.
ఇంగ్లిష్ కరన్ సినిమాలో మేమిద్దరం కలిసి నటించాము.అప్పుడు దర్శకుడు పరిచయం చేశారు.కానీ నాకు మధు అంతకు ముందే తెలుసు.
ఆ సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది.అని తెలపగా అనంతరం మధుమిత మాట్లాడుతూ.
ఇది మా అశోక్‌గాడి లవ్ స్టోరీ సినిమాలో శివని చూసినప్పుడే ఈ అబ్బాయి ఎవరో బాగున్నాడు అనుకున్నాను.కానీ తనతో కలిసి నటించే అవకాశం వస్తుందనుకోలేదు.
ఇంగ్లిష్ కరన్ సమయంలో దర్శకుడు పరిచయం చేయగానే నేను చాలా ఆశగా పలకరించాను.శివ మాత్రం ఏదో సాధారణంగా హలో చెప్పి వెళ్లిపోయాడు.
కొంచెం ఫీల్ అయ్యాను.ఏంటి ఇలా పలకరించాడు అనుకున్నాను అని తెలిపింది.
అలా మొదట్లో నేను హాయ్ అంటే హాయ్ అనేవాడు.ఆ తర్వాత నాపై ఆయనకు ఆసక్తి కలిగింది అని చెప్పుకొచ్చింది మధుమిత. ఈ క్రమంలోనే మధుమిత శివబాలాజీ ఇద్దరూ వారి ప్రేమ వివాహం విషయంలో ఎదుర్కొన్న చేదు విషయాలను చెప్పకొచ్చారు.తరువాత వెన్నెల కిషోర్ మీ భాగస్వామిపై ఉన్న 5 కంప్లైంట్స్ చెప్పండి? అని అడగగా శివ బాలాజీ మాట్లాడుతూ.టీ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది.నేను టీ పెట్టి ఇస్తే వంకలు పెడుతుంది.
ఇచ్చిన చాలాసేపటికి తాగకుండా, మళ్లీ వేడి చేసిస్తారా అని అడుగుతుంది.ఈ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది.
అప్పుడు వెంటనే మధుమిత మాట్లాడుతూ. ఏదైనా చెబితే వినిపించుకోడు.
నేనేమో విన్నాడనుకుని చెప్పేసి వెళ్లిపోతాను.అంతకు మించి కంప్లైంట్స్ లేవు అని తెలిపింది.