త్వరలోనే మెగా ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ రెడీ అవుతుంది.మెగా హీరోల సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మరి ఈసారి మెగా హీరోలు నెల రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు.మరి ఆ మూడు సినిమాలు ఏంటో.? ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకుందాం.ముందుగా పవర్ స్టార్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’( Bro ) సినిమాతో ట్రీట్ స్టార్ట్ కాబోతుంది.
మెగా హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఆ తర్వాత మరో మెగా హీరో రెండు వారాల తర్వాత ‘భోళా శంకర్( Bhola Shankar )’ సినిమాతో రాబోతున్నాడు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది.మెగాస్టార్ కు జోడీగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.
కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
<img src=" https://telugustop.com/wp-content/uploads/2023/06/BRO-Megastar-Chiranjeevi-Bholaa-Shankar-Varun-Tej-Gandeevadhari-Arjuna.jpg”/>
ఇక ముచ్చటగా మూడవ సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుండి రాబోతుంది.ప్రెజెంట్ వరుణ్ తేజ్ ‘గండీవధారి అర్జున’( Gandeevadhari Arjuna )’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తామని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇలా భోళా శంకర్ రిలీజ్ తర్వాత రెండు వారాలలో వరుణ్ మెగా ఫ్యాన్స్ ను అలరించనున్నాడు.
ఇలా మెగా హీరోలు వరుసగా మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.చూడాలి వీటిలో ఏ సినిమా ఎవరిని మెప్పిస్తుందో.