అప్పుడు అన్నమయ్యకు మీసాలు ఇప్పుడు రామునికి మీసాలు.. ఆ కామెంట్లపై క్లారిటీ ఇదేనంటూ?

డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్, కృతి సనన్( Prabhas, Kriti Sanon ) జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్.ఈ సినిమా ఈనెల 16న విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

 The Debate Whether The Rama Character Should Be With Moustache Or Without It, Ad-TeluguStop.com

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా నుంచి మొదలైన టీజర్ పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.కాగా ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిన విషయం తెలిసిందే.

అయితే ఇదివరకు రామాయణం ( Ramayanam )ఆధారంగా వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఆది పురుష్ సినిమా మరొక ఎత్తు అని చెప్పవచ్చు.

ఇంతకముందు రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాలు చూస్తే సీతారాములు, రావణుడు, లక్ష్మణుడు, శూర్పణఖ ఇలా తెలుగువాళ్ళ నోళ్ళలో ఆ.పేర్లే వినపడేవి.కానీ ఈ ఆదిపురుష్ ( Adipurush )మూవీలో కొంచెము వైవిధ్యంగా ఉంటాయి.

రామ అని కాకుండా రాఘవ్ అని, సీత కి బదులు జానకి అని, రావణ పేరుని లంకేశ్వర్ అని, లక్ష్మణుడిని శేష్ అని ఇలా పెట్టారు.ఇది ఇలా ఉంటే ఇందులో ప్రభాస్ కి మీసాలు పెట్టి, మీసాల రాముడిని చేసారు కదా అని అడిగితే, సినిమా చూస్తే ప్రేక్షకులకు అర్థం అవుతుంది, అందరికి నచ్చుతుంది అని సమాధానం ఇస్తున్నారు చిత్ర బంధం.

ఇంతవరకు వచ్చిన పౌరాణిక సినిమాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలకు ఎక్కడా మీసాలు పెట్టినట్టు లేదు.ఇప్పుడు ఈ ఆదిపురుష్ #Adipurush లో మాత్రం ప్రభాస్ #Prabhas మీసాలతో కనిపించనున్నాడు.అయితే అప్పట్లో అన్నమయ్య #Annamayya సినిమా అప్పుడు నాగార్జున ఆ పాత్ర చేసినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది.అన్నమయ్యకి మీసాలు ఉంటాయా అని, వుండవు అని ఇలా చర్చ జరిగినప్పుడు మీసాలు ఎందుకు వుండకూడదు అని నాగార్జున మీసాలతో నటించాడు.

కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.అందువల్ల రాముడికి కూడా మీసాలు ఉంటే తప్పులేదు అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube