బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా( Urvasi Rautela ) ఈ మధ్య టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.ఎందుకంటే ఈ భామకు ప్రజెంట్ బాలీవుడ్ లో అంతగా అవకాశాలు లేవు.
అందుకే ఈమె ఇక్కడ వచ్చిన ఆఫర్స్ ను వదులుకోవడం లేదు.ఇప్పటికే ఈ భామ వరుసగా ఐటెం సాంగ్స్( Urvasi Rautela Item songs ) చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.
ఈమె ముందుగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఇక్కడ పరిచయం అయ్యింది.బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేసి అందరిని ఆకట్టు కుంది.
ఇక ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ లో కూడా చిందేసింది.ఇప్పుడు ముచ్చటగా మూడవసారి పవన్, సాయి తేజ బ్రో సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తుంది.
పవన్, తేజ్( Pawan kalyan, Sai tej ) ఇద్దరు కలిసి ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలాతో డ్యాన్స్ చేయబోతున్నారు.

ఈ సాంగ్ షూట్ ఇప్పుడు జరుగుతుంది.ఇదిలా ఉండగా ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ పై క్రేజ్ పెంచుకున్నట్టు అనిపిస్తుంది.ఎందుకంటే ఈ భామ వరుసగా పవర్ స్టార్ ఓల్డ్ వింటేజ్ సినిమాలు చూస్తూ ఆ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలుపుతుంది.
ఇప్పటికే ఈమె ఖుషి సినిమా చూసి ఫిదా అవ్వగా ఇప్పుడు బద్రి సినిమా( Badri movie ) చూస్తున్నాను అంటూ తెలిపింది.

వరుసగా పవన్ సినిమాలు చూస్తూ ఆయనపై క్రేజ్ పెంచుకుంటుంది.ఇదంతా బ్రో సినిమా( BRO Movie ) పరిచయమే అని తెలుస్తుంది.చూడాలి ఈ భామ నెక్స్ట్ ఏ సినిమా చూస్తుందో.
ఇదిలా ఉండగా ఈమె పవన్, సాయి తేజ్ తో ఎలాంటి స్టెప్పులు వేసి ఆకట్టు కుంటుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అలాగే అమ్మడి అందాల ఆరబోత కోసం కూడా ఎదురు చుస్తున్నారు.
జులై 28 వరకు వీరు ఎదురు చూడాల్సిందే.







