ఆ ఒక్కటి తగ్గించుకుంటే అనుపమ స్టార్ హీరోయిన్ అవ్వచ్చు..?

స్టార్ హీరోయిన్ల కి కూడా సొంతం కానీ అందం కొంతమంది చిన్న హీరోయిన్స్ కి సొంతం అవుతుంది.చూడటానికి చక్కగా తెలుగు అమ్మాయిలాగా అనిపించే హీరోయిన్స్ ఇండస్ట్రీ లో కొంత మంది మాత్రమే ఉన్నారు అలాంటి వాళ్లలో అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) ఒకరు… అందమైన హీరోయిన్లు సైతం ఇవి చాలవా అనుపమ అందం చూసి కుల్లుకోకుండ ఉండలేరు అందానికి అందం అభినయానికి అభినయం కలిసిన రూపం తో కుర్రకారుని సైతం ఆకట్టుకునే ఈ అమ్మడికి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలే తగ్గిపోయాయని చెప్పాలి.

 If You Reduce That One, Anupama Can Become A Star Heroine , Anupama Parameshwar-TeluguStop.com

కేరళ( Kerala ) ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో వచ్చిన అ ఆ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై…మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె అందంతో నటనతో మొదట్లోనే అందరిని కట్టిపడేసింది.ఒక్క తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం( Tamil, Malayalam ) సినిమాలలో కూడా నటించిన ఈమె మొదటిసారి మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత తెలుగు సినిమాలలో నటించింది.

అక్కడ పాపులారిటీ బాగా లభించడంతో తెలుగులో ప్రేమమ్, హలో గురు ప్రేమకోసమే , శతమానం భవతి ,తేజ్ ఐ లవ్ యు, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే మంచి హోదా దక్కించుకుంది.ఇక ఇటీవలే కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ఫ్లై వంటి చిత్రాలతో మళ్ళీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

 If You Reduce That One, Anupama Can Become A Star Heroine , Anupama Parameshwar-TeluguStop.com
Telugu Kerala, Malayalam, Tamil, Tollywood-Movie

సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక ఫోటోలు, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది.ఇక ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇది పక్కన పెడితే ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మకు చిన్న హీరోల సినిమాలలో తప్ప పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు పెద్దగా రాలేదని చెప్పవచ్చు.దానికి కారణం ఈమెకు ఉన్న తల పొగరే అని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Kerala, Malayalam, Tamil, Tollywood-Movie

ఈమె ఈగోని హర్ట్ చేస్తే అంతే సంగతే అని ఇక ఆమెకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారుతుంది.అందుకే టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోలు ఈమెకు అవకాశం ఇవ్వడం లేదు అని చిన్న హీరోలకే పరిమితం అవుతోందని చెప్తున్నారు…కానీ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరి కంటే అనుపమ చాలా వరకు బెస్ట్ హీరోయిన్ అని కొంతమంది వల్ల అభిప్రాయాలని చెప్తున్నారు మరి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో తను ఎప్పుడూ సినిమాలు చేస్తుందో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube