మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను విచారణను సీబీఐ కోర్టు అనుమతించింది.కాగా వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.