హైదరాబాద్ సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.

వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను విచారణను సీబీఐ కోర్టు అనుమతించింది.

కాగా వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది… గ్లింప్స్ తో రఫ్ ఆడిస్తాడా..?