యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి...!

యాదాద్రి భువనగిరి జిల్లా:తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురెదురుగా వస్తున్న ఎర్టీగా కారు టీవీఎస్ లూనా ఢీకొని మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

 One Person Died In A Serious Road Accident In Yadadri District , Yadadri Distric-TeluguStop.com

ఈ ప్రమాదంలో టీవీఎస్ పై ప్రయాణిస్తున్న రాజపేట మండలం నెమలి గ్రామానికి చెందిన భువనగిరి మైసయ్య( Maisaiyya Bhuvanagiri )(35) అక్కడికక్కడే మృతి చెందగా ఎర్ర శంకరయ్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు.వృత్తిరీత్యా నమిలే నుండి వెంకటాపురం గ్రామానికి వస్తుండగా ఇర్టీగా కారు హైదరాబాద్ నుండి గుట్టకు వచ్చే క్రమంలో రోడ్డు పనులతో సింగిల్ రోడ్డు ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్,ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పీ వేశారు.కేసు నమోదు చేసుకొని,మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube