పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నేడు ఉదయం సుప్రభాత సేవలు తిరుమల శ్రీవారిని(Tirumal Srivaru) దర్శించుకున్నారు.ఇలా సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ప్రభాస్ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ప్రభాస్ ను స్వామి వారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇలా ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల సందడి చేశారు.దీనితో ప్రభాస్ తో సెల్ఫీలు దిగడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారు.
ప్రభాస్ స్వామి వారిని సంప్రదాయ దుస్తులను ధరించి దర్శించుకున్నారు.పంచ కట్టులో ప్రభాస్ స్వామి వారిని దర్శించుకున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ( Adipurush Movie) విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలు (Pre Release Event) తిరుపతిలోనే జరుగును నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం మొత్తం తిరుపతి చేరుకున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ నేడు ఉదయం వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.ఇక నేడు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రభాస్ మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుపతిలోని ఉండి అక్కడే బస చేసి అనంతరం ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కానున్నారు.

తిరుపతిలోని తారకరామ స్టేడియం(Tarakarama Stadium) లో జరిగే ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు జరగని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు.ఇక ఈ వేడుకకు చిన్న జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy)ముఖ్య అతిథిగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే.
రామాయణం (Ramayanam) ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సందర్భంగా ఈ సినిమా వేడుకను తిరుపతిలో నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.ఇక ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ నటించగా సీతమ్మ పాత్రలో కృతి సనన్ (Kriti Sanon) నటిస్తున్నారు.
ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.







