తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది నటీనటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.
అటువంటి వారిలో ప్రియాంక జైన్ కూడా ఒకరు.ప్రియాంక జైన్( Priyanka Jain ) అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ జానకి కలగనలేదు సీరియల్( janaki kalaganaledhu serial ) జానకి అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఈ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా క్రేజ్ ను ఏర్పరచుకుంది.కానీ ఈ సీరియల్ కంటే ముందు ఆమె మౌనరాగం సీరియల్ లో నటించింది.

అందులో సీరియల్ లో అమ్ములు( ammulu ) పాత్రలో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో సీరియల్స్ చూసే వారిని మాత్రమే కాకుండా, యూత్ ని కూడా ఆకట్టుకుంది.తన నటనతో టీవీ సీరియల్స్ అంటే ఇష్టపడని కుర్రకారుని టీవీలకు అతుక్కుపోయే విధంగా చేసింది.ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తోంది.ఇకపోతే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎక్కువ మంది ఎంతో ఇష్టంగా పెంచుకునే జంతువులలో శునకం( dog ) కూడా ఒకటి.
పెద్ద పెద్ద సెలబ్రిటీలు చాలామంది రెండు మూడు శునకాలను కూడా పెంచుకుంటూ ఉంటారు.అంతేకాకుండా వాటికోసం లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.అయితే ఈ సెలబ్రిటీలు అప్పుడప్పుడు ఆ శునకాలతో ఆడుకుంటున్న సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ప్రియాంక జైన్ కూడా తన శునకం కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఆ వీడియోలో ప్రియాంక తన పెంపుడు శునకాన్ని ముద్దాడుతూ.అమాంతం ఎత్తుకుని దానిపై ప్రేమ చూపిస్తూ గిరిగిరా తిప్పింది.
ఆ శునకం కూడా దాని నాలుకతో ఆమెను ముద్దాడుతూ కనిపించింది.తన పెంపుడు కుక్కపై ముద్దుల వర్షం కురిపించింది.
మొదట ప్రియాంక వద్దకు వచ్చిన ఆ శునకం దాని నాలుకతో చెంపలు, మెడపై, పెదాలపై నాకుతూ ఉండసాగింది.ఆ తరువాత ప్రియాంక జైన్ ఆ శునకాన్ని అమాంతం ఎత్తుకుంది.
దానికి ముద్దులు పెడుతూ గిరగిరమని తిప్పేసింది.కాగా ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు నవ్వులు పూయించే కామెంట్లు చేస్తున్నారు.ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటూ ఉంటారు.
బహుశా అది ఇదేనేమో కామెంట్స్ చేస్తుండగా, ఇంకొందరు ఆ కుక్క చాలా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







