ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.అదేంటి ఇంకా ఏడాది సమయం ఉంది కదా అనుకుంటే పొరబడినట్లే.
ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దమౌతోందా అనే డౌట్ రాక మానదు.ఎందుకంటే ఈ నెల 7 న సిఎం జగన్( jagan ) క్యాబినెట్ సమావేశం నిరవహిస్తుండడం, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) మేనిఫెస్టోను ప్రకటించి ఉండడం, అటు పవన్ కూడా తన వారాహి యాత్ర డేట్ కన్ఫర్మ్ చేయడం.
ఈ పరినమలన్నీ చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు సూచనే అనేది కొందరి భావన.అయితే ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఏపీలో తరచూ చర్చ జరుగుతూనే ఉంది.
అయితే ఈ విషయాన్ని ఏపీ సర్కార్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.

కానీ టీడీపీ జనసేన పార్టీ( Janasena party ) లు మాత్రం ముందస్తు ఎన్నికలు రావడం పక్కా అని బల్ల గుద్ది చెబుతున్నాయి.ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.అక్టోబర్ లో జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబర్ లో తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందట.
అందుకే జగన్ ప్లాన్ ముందుగానే పసిగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే మేనిఫెస్టో( Manifesto ) కూడా ప్రకటించారు.అంతే కాకుండా ముందస్తు ఎన్నికల విషయమై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు నేడు డిల్లీ కూడా వెళ్లనున్నారు.
మరోవైపు పవన్ కూడా తన ప్రచార రథం వారాహి ద్వారా ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొననున్నారు.ఈ ప్రచారంలో భాగంగానే పవన్ కూడా జనసేన మేనిఫెస్టో ప్రకటించే అవకాశం లేకపోలేదు.

అయితే జగన్ సర్కార్ మాత్రం ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూనే ఉంది.అయితే జగన్ ముందస్తు ఎన్నికల విషయంలో సైలెంట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కొందరి వాదన.తెలంగాణలో గత ఎన్నికల టైమ్ లో కేసిఆర్( KCR ) ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడన్ గా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి అందరికీ షాక్ ఇచ్చారు.అదే విధంగా ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలపై ఎలాంటి సమాచారం బయటకు రాకుండా సడన్ గా అసెంబ్లీ రద్దు చేసే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీని విషయమై ఈ నెల 7 న జరిగే కేబినెట్ సమావేశంలో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.అందుకే టీడీపీ, జనసేన అలెర్ట్ అయి ఎన్నికల హడావిడిని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
మరి ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ సర్కార్ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.








