దశాబ్ది ఉత్సవాల్లోనైనా ఆదరించండి - 1969 తొలి తెలంగాణ ఉద్యమకారుల విజ్ఞప్తి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు పోరాడి జైలు జీవితం గడిపి నేడు వృద్ధాప్య దశలో ఇబ్బందులు పడుతున్న 1969 తొలి తెలంగాణ ఉద్యమకారులమైన మమ్ములను తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలోనైన ఆదరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అర్వపల్లి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.1969 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసి సర్వం కోల్పోయి వృద్ధాప్య దశలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.2015లో 50మందిని 1969 ఉద్యమకారులుగా గుర్తించి ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా సన్మానం చేశారని గుర్తు చేశారు.

 Embrace Even Decade Celebrations 1969 First Telangana Activists Appeal,1969 Tela-TeluguStop.com

నాటి నుండి నేటి వరకు ప్రభుత్వపరంగా మాకు ఎటువంటి సహకారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.జూన్ 2 నుండి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తొలి ఉద్యమకారులుగా ఉన్న మాకు పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ లు, రైలు బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య రక్షణ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోయ వెంకటనారాయణ, కల్వకుంట్ల హనుమంతరావు, కొండ మనోహర్, గట్టు మోహన్ రావు, పసుపులేటి కృష్ణమూర్తి, ప్రకాష్ రావు, నరసయ్య, కూరపాటి కృష్ణమూర్తి, తప్సీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube