ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ ఏజెంట్.. ఇప్పుడు రూ.1000 కోట్ల ఆస్తి.. ఎలా సక్సెస్ అయ్యాడంటే?

సక్సెస్ సాధించడం ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా జరుగుతుంది.కొంతమంది సులువుగానే కెరీర్ విషయంలో సక్సెస్ అయితే మరి కొందరు మాత్రం సక్సెస్ కావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

 Royal Oak Founder Vijai Subramaniam Success Story Details Here Goes Viral , Roya-TeluguStop.com

అయితే కొంతమంది సక్సెస్ స్టోరీల గురించి తెలిస్తే మాత్రం నిజంగా గ్రేట్ అని అనిపిస్తుంది.అదే సమయంలో వాళ్లలా మనం కూడా కెరీర్ పరంగా సక్సెస్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది.

రాయల్ ఓక్ ఫౌండర్ సుబ్రమణియన్ ( Royal Oak Founder Subramanian )సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే మాత్రం నిజంగానే ఆశ్చర్యపోవాలి.క్రెడిట్ కార్డ్ ఏజెంట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ వ్యక్తి ప్రస్తుతం 1000 కోట్ల ఆస్తికి అధిపతి కావడం గమనార్హం.

అయితే విజయ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక 20 సంవత్సరాల కష్టం ఉంది.విజయ్ ఏపీలోని ( Vijay in AP )ప్రభుత్వ కళాశాలలో బీకామ్ చదివారు.

అయితే విజయ్ పైనే కుటుంబం ఆధారపడి ఉండటం మాస్టర్ డిగ్రీ చేయాలన్న విజయ్ కల నిజం కాలేదు.

Telugu Bangalore, Big Bazaar, Royal Oak, Royaloak, Safina, Singapore-Movie

విజయ్ బీకామ్ చదివిన తర్వాత ఈ వ్యక్తి బంధువు ఒకరు ఇతనికి సింగపూర్( Singapore ) లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారు.ఆ తర్వాత మున్నార్ కు వెళ్లిన విజయ్ క్రెడిట్ కార్డ్ ఏజెంట్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు.ఆ తర్వాత ప్లాస్టిక్ వస్తువుల బిజినెస్ ను విజయ్ మొదలుపెట్టడం గమనార్హం.

ఆ తర్వాత విజయ్ బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్ మొదలుపెట్టడంతో ఇతని కెరీర్ మలుపు తిరిగింది.

Telugu Bangalore, Big Bazaar, Royal Oak, Royaloak, Safina, Singapore-Movie

ఈ స్టాల్ వల్ల విజయ్ కు బిగ్ బజార్( Big Bazaar ) అవుట్ లెట్ స్టోర్ ఏర్పాటు చేసే ఛాన్స్ వచ్చింది.ఆ తర్వాత ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుని విజయ్ కారు కూడా కొన్నాడు.విజయ్ 2004లో ఫర్నీఛర్ మొదటి షాపును ఓపెన్ చేశాడు.చైనీస్ ఫర్నీచర్ ను దిగుమతి చేసుకోవడానికి విజయ్ ఆసక్తి చూపేవాడు.2010లో మరో షాప్ ఏర్పాటు చేయగా అప్పటినుంచి రాయల్ ఓక్ ప్రస్థానం మొదలైంది.ప్రస్తుతం ఈ సంస్థకు 150 స్టోర్లు ఉన్నాయి.ఒక్కో మెట్టు ఎదుగుతూ విజయ్ ఈ స్థాయికి చేరుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube