చిక్కుడులో పొడి వేరు( Dry Root ) కుళ్ళు సొలని అనే శిలీంద్రం వల్ల సోకుతుంది.ఈ శిలీంద్రాలు పంట అవశేషాలలో ఎక్కువ రోజులు జీవించి ఉంటాయి.
ఈ శిలీంద్రాలు చిక్కుడు ( Beans ) విత్తనాలలోకి ప్రవేశించి నీరు, పోషకాలు వెళ్లే కణజాలాల పై నివాసం ఉంటాయి.తద్వారా చిక్కుడు మొక్కకు సక్రమంగా నీరు పోషకాలు అందకపోవడం వల్ల దిగుబడి తగ్గి తీవ్ర నష్టం కలుగుతుంది.
ఈ పొడి వేరు కుళ్ళు సోకిన మొక్కలు( Rotten Plants ) ముందుగా పసుపు రంగులోకి మారి వాలిపోతాయి.మొక్క వేర్లపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
ఈ మచ్చలు గోధుమ రంగు లోకి మారిన తర్వాత వేర్ల పై పగుళ్లు ఏర్పడతాయి.కణజాలాలు పూర్తిగా దెబ్బతింటాయి.
తర్వాత వేర్ల కోణాలు ముడుచుకుపోయి చిక్కుడు మొక్కలు చనిపోతాయి.తరువాత భూమిలోని మట్టి ద్వారా ఒక మొక్క వేర్ల నుండి మరొక మొక్క వేర్ల కు సులభంగా సంక్రమిస్తాయి.
ఈ పొడి వేరు కుళ్ళు మొక్కలకు సోకకుండా ఉండాలంటే మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.మొక్కల మధ్య సూర్య రశ్మి పడేలాగా కాస్త దూరంగా నాటు కోవాలి.మొక్కలకు సమతుల్యంగా నీటిని అందించాలి.భూమిలో మట్టి గడ్డలు లేకుండా భూమిని మెత్తగా చదును చేసుకోవాలి.మొక్కలకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తెగులు సోకిన మొక్కలను గుర్తించి వెంటనే పీకి కాల్చి నాశనం చేయాలి.
ముందుగా సేంద్రీయ పద్ధతిలో చీడపీడలను, పొడి వేరు కుళ్ళు ను నివారించే చర్యలు చేపట్టాలి.ఒకవేళ వ్యాప్తి అధికంగా ఉంటే ట్రైకోడెర్మా హర్జియానుం వాడి ఈ శిలింద్రని నియంత్రించాలి.ఇలా అన్ని సంరక్షక చర్యలు తీసుకొని సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.