ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్(Anupama Paramwswaran) .ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తమిళ తెలుగు భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.
అనుపమ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.తాజాగా నిఖిల్(Nikhil) సరసన ఈమె కార్తికేయ 2(Karthikeya)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసిందే.ఈమె గతంలో ప్రముఖ క్రికెట్ బుమ్రాతో ప్రేమలో ఉన్నారట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఆయన తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు చెక్ పడింది.ఇలా తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలిచినటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈమె సోషల్ మీడియా వేదికగా తన ఎంగేజ్మెంట్ రింగ్(Engagement Ring) అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అనుపమ పరమేశ్వరన్ ఒక ప్లాస్టిక్ పేపర్ ను ఉంగరం లా తయారు చేసి తన వేలికి తొడిగి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేస్తూ తన ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ చెప్పుకొచ్చారు.దీంతో అనుపమ పరమేశ్వరన్ ఎంగేజ్మెంట్ (Engagement)చేసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరిచారు.
అయితే ఈమె సరదాగా ఇలాంటి పోస్ట్ చేశారని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈమె పోస్ట్ చూస్తే మాత్రం… అనుపమ పరమేశ్వరన్ కుపెళ్లి పై గాలి మళ్లీందని అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అంటూ పలువురు ఈ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.







