తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Government ) రైతుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతుబంధు జిల్లా కమిటీ సభ్యత్వానికి రాజీనామ చేసినట్లు మందడపు తిరుమలరావు( Mandadapu Tirumala Rao ) పేర్కొన్నారు.ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయ నిర్మలకు తన రాజీనామ పత్రాన్ని బుధవారం అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఆసరా కల్పించకపోవడం, సాగునీటి సరఫరాలో విఫలం, వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సీడి అందించడంలో నిర్లక్ష్యం, అకాల వర్షాలకు( Untimely Rains ) పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.ఈ నేపథ్యంలో రైతులకు సరైన న్యాయం చేయలేని ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామ చేసినట్లు వివరించారు.
సబ్బండ వర్గాల ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) బాటలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా తిరుమలరావు తెలిపారు.







