గోధుమలో( Wheat ) ఆకు ఎండు తెగులు మట్టి ద్వారా విత్తనానికి వ్యాపిస్తుంది.ఈ తెగులు సోకితే విత్తనాలు ముడుచుకు పోయినట్లు చిన్నగా కనిపిస్తాయి.
ఈ తెగులకు సంబంధించిన అవశేషాలు భూమిలో చాలా కాలం వరకు జీవించి ఉంటాయి.గోధుమ సాగుచేసిన ఏడు వారాల తర్వాత ఈ చెవుల లక్షణాలు మొక్కలలో గమనించవచ్చు.
ఇక పంట కోతకు వచ్చే సమయానికి ఈ తెగుల వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంటుంది.ఈ తెగులు ముందు గోధుమ రంగులో ఉండి తర్వాత బూడిద రంగులోకి మారుతాయి.
ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు ఎండిపోయి చనిపోతాయి.
ఈ తెగులను గుర్తించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకేసి కాల్చి నాశనం చేయాలి. గాలి ఎటువైపుకు వేస్తుందో ఆ దిశ లో సమాంతరంగా మొక్కల వరుసలను నాటుకోవాలి.మొక్కల మధ్య గాలి బాగా వీచే విధంగా నాటుకోవాలి.
మొక్కలకు అధిక తేమ తగిలితే ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.కాబట్టి నీటి తడుల విషయంలో జాగ్రత్త వహించాలి.
ఎక్కువగా రాత్రి సమయాలలో కాకుండా పగటి సమయాలలో నీటి తడులు అందించాలి.
ఈ తెగులను అరికట్టాలంటే ముందుగా మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకొని విత్తుకోవాలి.ఈ విత్తనాలను 0.5 గ్రా.ఇమిడ క్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ట్రైకోడెర్మా విరిడే( Trichoderma viride ), విటావాక్స్ మిశ్రమం ఈ తెగుళ్ల వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుంది.కాబట్టి వీటికి తోడు 2-3% యూరియా( Urea ) ను జినెబ్ తో కలిపి పంటకు పిచికారి చేయాలి.మొదట సాధారణ పద్ధతిలో సజల వేప ఆకు సారాలను ఉపయోగించాలి.
ఈ పద్ధతులను సరైన సమయంలో పాటించి పంటను తెగుళ్ల నుండి సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.