ఈ ఐపీఎల్ సీజన్-16 లో చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని( Mahendra Singh Dhoni ) తన మాస్టర్ మైండ్ తో గమ్యానికి చేర్చి ఐదవ సారి చెన్నై జట్టుకు టైటిల్ వచ్చేలా చేశాడు.చెన్నై జట్టు( chennai super kings ) పడుతూ లేస్తూ ఉన్న సమయంలో అనుభవం లేని యువ ఆటగాళ్లతో అద్భుతం చేసి చూపించాడు.
మహేంద్రసింగ్ ధోని వయసు మీద పడుతున్న తన మాస్టర్ మైండ్ తో జట్టు సపోర్ట్ గా నిలిచి జట్టును విజేతగా నిలిచేలా చేశాడు.
అయితే ఈ సీజన్ ప్రారంభం నుంచి క్రికెట్ అభిమానులలో మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ పై చర్చలు మొదలయ్యాయి.
దాదాపుగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అనే వార్తలు సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అయ్యాయి.కానీ మహేంద్రసింగ్ ధోని ఈ ఐపీఎల్ సీజన్ ముగిసే వరకు రిటైర్మెంట్ పై స్పందించకపోవడంతో స్పష్టమైన క్లారిటీ లేకుండా పోయింది.
అయితే చెన్నై జట్టు టైటిల్ గెలిచిన తర్వాత ఫాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమను వెలకట్టడం అసాధ్యం అని, ఫ్యాన్స్ కోసం మరో సీజన్ ఆడే ప్రయత్నం చేస్తానని తెలిపాడు.తర్వాత సీజన్లో తన శరీరం సహకరిస్తుందో లేదో చూడాల్సి ఉందని స్పష్టంగా తెలిపాడు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం మహేందర్ సింగ్ ధోని ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు.కానీ ఫ్యాన్స్ కోసం ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకుండా మరో సీజన్ ఆడితే ఫ్యాన్స్ కు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుందని కాస్త భావోద్వేదానికి గురైన 41 ఏళ్ల మహేంద్రసింగ్ ధోని తన ఫీచర్ గురించి మాట్లాడడంతో ఫ్యాన్స్ లో జోష్ నెలకొంది.ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు మ్యాచ్ ఆడిన ప్రతి స్టేడియంలో ఎల్లో జెర్సీలు నిండుగా కనిపించాయి అని, అందుకే ఫ్యాన్స్ నాపై చూపిస్తున్న అభిమానానికి మరో సీజన్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.మొత్తానికి తమ కోసం మహేంద్రసింగ్ ధోని మరో సీజన్ ఆడుతున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.