నిర్మల్ జెడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీటీసీల మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది.
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఆలస్యం కావడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని జెడ్పీటీసీలు నిలదీశారు.ఈ క్రమంలో జెడ్పీటీసీలు మాట్లాడుతుండగా అధికారులు మైకును కట్ చేశారు.
దీంతో కోపోద్రిక్తుడైన సారంగపూర్ జెడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి మంత్రి ముందే మైకును విసిరేశారు.అదేవిధంగా ఖానాపూర్ లోని సమస్యలపై ఎమ్మెల్యే రేఖా నాయక్ కు జెడ్పీటీసీ జానుబాయి మధ్య వాగ్వివాదం జరిగింది.
దీంతో సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది.







