బర్త్ డే ట్రీట్ కు రెడీ అవుతున్న విజయ్.. ఈసారి గ్లింప్స్ మాములుగా ఉండదట!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ‘వారిసు’ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించిన ఈయన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఆ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘లియో’.

 Thalapathy Vijay Lokesh Kanagaraj Leo Glimpse Details, Thalapathy Vijay, Lokesh-TeluguStop.com

( Leo Movie ) భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల బరిలో ఉంది.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘లియో’.

లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెరిగాయి.

Telugu Leo Glimpse, Leo, Sanjay Dutt, Tirsha-Movie

ఈ ప్రాజెక్ట్ లో వివిధ బాషలలో స్టార్స్ భాగం అయ్యారు.అందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నారు.ఈయన కీ రోల్ లో నటిస్తున్నాడు.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నుండి త్వరలోనే బర్త్ డే బ్లాస్ట్ సిద్ధం అవుతుంది అని టాక్.జూన్ 22న విజయ్ పుట్టిన రోజు ఉంది అనే విషయం తెలిసిందే.మరి ఈ బర్త్ డే రోజు లోకేష్ అదిరిపోయే బ్లాస్ట్ సిద్ధం చేస్తున్నాడట.

Telugu Leo Glimpse, Leo, Sanjay Dutt, Tirsha-Movie

కోలీవుడ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా నుండి పోస్టర్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ గ్లింప్స్ సుమారు నిముషం నిడివి ఉండేలా కట్ చేసారని టాక్.చూడాలి ఈ సినిమా గ్లింప్స్ ఏ రేంజ్ లో ఆకట్టు కుంటుందో.ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube