'జయం' చిత్రం లో గోపీచంద్ పాత్ర ని మిస్ చేసుకున్న ప్రముఖ హీరో అతనేనా..!

లవ్ స్టోరీస్ లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా ‘జయం’.( Jayam Movie ) తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ ఫేమస్.మొన్న ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ ‘రాను రాను అంటూనే చిన్నడోయ్’ అని మాచెర్ల నియోజకవర్గం లో పెట్టినందుకు ఆ చిత్రం పై బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

 Actor Prakash Raj Missed Gopichand Role In Jayam Movie Details, Actor Prakash Ra-TeluguStop.com

ఈ చిత్రం లోని పాటలకు అంత క్రేజ్ ఉంటుంది.ఈ సినిమా విడుదల అయినా మొదటి వారం మొత్తం నెగటివ్ టాక్ ఉండేదట.కానీ చిన్నగా టాక్ ఇంప్రూవ్ అవుతూ రెండవ వారం నుండి సునామి లాంటి వసూళ్లు వచ్చాయని చెప్తుంటారు ట్రేడ్ పండితులు.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా ఒక ప్రభంజనం.

అప్పటి వరకు ఆ ప్రాంతం లో ఆల్ టైం రికార్డు గా కొనసాగిన పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ( Kushi Movie ) రికార్డు ని బద్దలు కొట్టిన సినిమా ఇది.

Telugu Prakash Raj, Allari Naresh, Allu Arjun, Teja, Gopichand, Nithin, Jayam, N

ఈ చిత్రం వసూళ్లను నైజాం ప్రాంతం లో అందుకోవడానికి కొంత మంది స్టార్ హీరోలకు సుమారు పదేళ్లు పట్టింది అంటే దీని రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరో నితిన్( Hero Nithin ) కంటే కూడా ఎక్కువగా విలన్ గా నటించిన గోపీచంద్ కి ( Gopichand ) ఎక్కువ పేరు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం లో ఆయన చూపించిన నట విశ్వరూపాన్ని ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వెలిసాయి.ఒక విలన్ కి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పడడం అనేది కేవలం గోపీచంద్ విషయం లోనే జరిగింది.

అయితే ఈ సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలను ముందుగా నితిన్ మరియు గోపీచంద్ ని అనుకోలేదట డైరెక్టర్ తేజ. ఆయన దృష్టిలో ఈ పాత్రలకు గాను ఇద్దరు హీరోలను మైండ్ లో ఉంచుకున్నాడట.

Telugu Prakash Raj, Allari Naresh, Allu Arjun, Teja, Gopichand, Nithin, Jayam, N

ఆ హీరోలు మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) మరియు అల్లరి నరేష్.( Allari Naresh ) అల్లు అర్జున్ ని హీరో గా పరిచయం చేస్తూ, అలాగే అల్లరి నరేష్ ని కూడా ఈ సినిమా ద్వారానే విలన్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాడట.కానీ వాళ్ళిద్దరికీ ఈ సినిమా కథ నచ్చలేదు.దీనితో అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీ లో కొనసాగుతాయన్న సుధాకర్ రెడ్డి తన కొడుకు నితిన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసే ప్రయత్నంలో ఎన్నో కథలను విన్నాడు.

అందులో ఆయనకీ జయం కథ బాగా నచ్చింది.వెంటనే ఓకే చెప్పేసాడు.ఇక ఈ చిత్రం లో కీలకమైన విలన్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని( Prakash Raj ) అనుకున్నారట.ఆ సమయం లో ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో, ఎప్పటి నుండో తేజ తో టచ్ లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి ఆ ఛాన్స్ దక్కింది.

ఆ తర్వాత హిస్టరీ మన అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube