8 గిన్నిస్ రికార్డ్స్ కొట్టేసిన జ్యువెలర్స్... ఎక్కడుందో తెలుసా?

హైదరాబాద్‌లోని గత ఎన్నో సంవత్సరాలనుండి వారసత్వ సంపదగా రాణిస్తున్న ప్రముఖ ఆభరణాల సంస్థ ‘శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్’( Shiva Narayan Jewelers Private Limited ) తాజాగా 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించి, రికార్డు సృష్టించింది.ఈ సందర్భాన్ని శివనారాయణ మహోన్నత వారసత్వాన్ని ప్రశంసించడానికి తాజాగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.

 8 Guinness World Record Breaking Jewellers Do You Know Where, 8 Guinness World-TeluguStop.com

ఈ భారీ వేడుకలో బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ దిశా పటానీ, శివ నారాయణ్( Disha Patani, Shiva Narayan ) యొక్క అత్యున్నత ఆభరణాలను ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసారు.

ఈ కార్యక్రమంలో ‘ఎక్స్‌పీరియన్షియల్ జోన్’( Experiential Zone ) అనే కార్యక్రమం చాలా ఆకర్షణీయంగా నిలిచింది.ఈ సందర్భంగా అనేక ఆభరణాలను ఇక్కడ సెలబ్రిటీల చేతుల మీదుగా ప్రదర్శించారు.ఇందులో మొదటిది గణేష్ లాకెట్టు( Ganesh pendant )… 1011.150 గ్రాముల బరువున్న అత్యంత బరువైన ఈ లాకెట్టుని చూసి ఆహుతులు అలరించారు.లాకెట్టుపై ఉంచిన అత్యధిక సంఖ్యలోని వజ్రాలు (11,472) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించిందని సమాచారం.

కాగా ఈ ఆభరణాన్ని రూపొందించడానికి 6 ½ నెలలు సమయం పట్టిందని శివ నారాయణ్ జ్యువెలర్స్ నిర్వహకులు చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో వారి రికార్డ్ వారే బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు.అంతకు మునుపు ‘రామ్ దర్బార్’ 1681.820 గ్రాముల భారీ లాకెట్టుని 54,666 వజ్రాలతో ఒక పెండెంట్‌పై అమర్చిన కారణంగా గిన్నిస్ ప్రపంచ రికార్డుని సాధించారు.కాగా తాజాగా ఈ రికార్డుని వారే మరలా అధిగమించడం గమనార్హం.ఈ లాకెట్టు వెనుక భాగంలో కూడా శ్రీరామ్ అని రాసి ఉన్న వజ్రాలతో రూపొందించబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube