1.నిర్మల్ హృదయ్ భవనానికి జగన్ దంపతులు

ఏపీ సీఎం జగన్ దంపతులు ఈరోజు విజయవాడలో పర్యటించారు.రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయపూర్వక సందర్శించారు.దాదాపు 30 నిమిషాల పాటు అనాధ పిల్లలతో జగన్ దంపతులు ముచ్చటించారు.
2.సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు
ఎన్నికలు వస్తున్నాయి అనగానే గుంట నక్కలు పగటి వేషాలు వేసుకుని వస్తున్నాయని, ప్రజలను భ్రమల్లో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయని టిడిపిని ఉద్దేశించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు
3.చంద్రబాబుపై అనిల్ కుమార్ విమర్శలు

2024 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు సెంటు భూమిలో కప్పెడతారు అని మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
4.సుజనా మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది.2023 – 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
5.ప్రభుత్వానికి ఏపీ జెఏసీ హెచ్చరిక
గత 84 రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఏపీ జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.ఇక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
6.తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు చర్యలు

తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు.ఘాట్ రోడ్డు లో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు .సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వాహనాలు అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
7.వైసిపి మంత్రులకు దూళిపాళ్ల సవాల్
98% పైగా హామీలు అమలు చేశామని అంటున్న జగన్మోహన్ రెడ్డి, అతని ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీసులు భద్రతా సిబ్బంది లేకుండా ప్రజల్లోకి వెళ్ళగలరా అంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు.
8.అంజన్ కుమార్ యాదవ్ కు ఈడి నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు మరోసారి ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
9.దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
జనాభా ప్రాతిపదికన 2026 తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
10.ఎంపీ జీవీఎల్ కామెంట్స్
ఏపీకి ప్రత్యేక నిధులు ఇచ్చి కేంద్రం తన ఉదారత ను చాటుకుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
11.చంద్రబాబువి అన్ని శంకుస్థాపనలే ప్రారంభోత్సవాలు ఉండవు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబువి అన్ని శంకుస్థాపనలేనని, వేటికి ప్రారంభోత్సవాలు చేయలేదని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
12.రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రేషన్ కార్డును ఉన్న ఉన్నవారికి సబ్సిడీ కందిపప్పు, చెక్కెరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.
13.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది .టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
14. బ్రహ్మోత్సవాలు
దక్షిణ సింహాచలం పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 12 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
15.శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
రేపు కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
16.శ్రీవారి వార్షిక జేష్ఠభిషేకం

జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జేష్ఠభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి.
17.యువ గళం పాదయాత్ర
నేటి నుంచి కడప జిల్లాలో తిరిగి లోకేష్ యువ గళం పాదయాత్ర చేపట్టారు.మహానాడు కోసం రెండు రోజుల పాటు విరామం తీసుకున్నారు.జమ్మలమడుగులో ఈరోజు లోకేష్ యాత్ర మొదలైంది.
18.ఉద్యోగుల సామూహిక రిలే నిరాహార దీక్ష
నేడు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.నిరసన కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
19.ఎంఐఎం బహిరంగ సభ
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నేడు ఎంఐఎం బహిరంగ సభ జరగనుంది.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,450
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,490
.






