నరేష్, పవిత్ర లోకేష్ గత ఏడాదిగా టాలీవుడ్ లో బాగా వార్తలో ఉంటున్న జంట ఇది .వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లు ఓపెన్‌గానే చెప్పేసారు.అంతేకాదు వీళ్ల నిజ జీవితంలో జరిగిన సంఘటలను వాళ్ల కోణంలోనే ఆవిష్కరిస్తూ మళ్లీ పెళ్ళి సినిమా ( Malli Pelli Movie ) చేసారు.ఈ సినిమాను పూర్తిగా నరేష్, పవిత్ర లోకేష్ ( Naresh Pavitra Lokesh ) యాంగిల్‌లో తెరకెక్కించారు.
అందులో నిజం సంగతి పక్కన పెడితే.విడుదల ముందు తమ సినిమాపై కాస్త హైప్ క్రియేట్ చేసినా.
అది కలెక్షన్స్ రూపంలో మాత్రం కనిపించలేదు.మళ్ళీ పెళ్ళి సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోయినా.
వీళ్లిద్దరు మాత్రం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

మాములుగా సినిమా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి.కొన్ని విషయాలు బయటకు చెప్పాలన్నా.చాలా ఆలోచిస్తారు.
కానీ నరేష్, పవిత్ర లోకేష్ మాత్రం అందుకు విరుద్దం గా ప్రవర్తిస్తున్నారు.తమ పర్సనల్ లైఫ్‌లో జరిగే రచ్చను వీరు పబ్లిసిటీగా మార్చుకున్నారని అందరు చెప్పుకుంటున్నారు.
నరేష్, పవిత్రల పెళ్లి ఆలస్యానికి .నరేష్ మూడో భార్య విడాకులు ఇవ్వకపోవడమే పెద్ద కారణం… ఒక వేళ ఇచ్చి ఉంటే.ఈ పాటికీ వీళ్లిద్దరు పెళ్లి చేసుకునేవారు అయినా.సమాజం గురించి పట్టించుకోకుండా.వీళ్లిద్దరు సహ జీవనం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తాము పెళ్లి తర్వాత పిల్లలను కంటాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై నెటిజన్స్ మరింత గా కామెంట్స్ చేస్తున్నారు నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు…

ముగ్గురితో కూడా నరేష్ కలిసి ఉండటం లేదు.ఇద్దరికి విడాకులు ఇచ్చేశాడు.మూడో భార్య రమ్య( Ramya Raghupati ) విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది.ఈ క్రమంలో ఆయన నాలుగో పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి.నరేష్ పవిత్ర కలిసి 2018లో సమ్మోహనం సినిమా చేశారు.మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా ఈ సినిమా వచ్చింది.
ఇందులో సుధీర్ తల్లిదండ్రులుగా నరేష్ పవిత్ర లోకేష్ నటించారు.అయితే ఈ సినిమాలో వీరిద్దరు నటించిన అనేక సన్నివేశాలు వీరి ప్రేమ విషయం బహిర్గతం కాగానే.
నెటింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా త్వరలోనే పిల్లలని కంటమణి చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి…
.







